మహిళా సాధికారత దిశగా అడుగులు | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారత దిశగా అడుగులు

Mar 26 2026 7:37 AM | Updated on Mar 26 2026 7:37 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: మహిళా సాధికారత దిశగా జిల్లా మరో ముందడుగు వేసిందని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. జిల్లా మహిళా సమాఖ్య, సెర్ప్‌ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని కలెక్టరేట్‌ ఎదుట ఏర్పాటు చేసిన ఆదిలాబాద్‌ మహిళా మార్ట్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూషతో కలిసి బుధవారం ప్రారంభించారు. జిల్లాలోని మహిళా సంఘాలు తయారు చేస్తున్న సుమారు 30 రకాలకు పైగా నాణ్యమైన ఉత్పత్తులు ఇందులో లభ్యమవుతాయన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, వార్డ్‌ కౌన్సిలర్‌ కలాల శ్రీనివాస్‌, మహిళా సమాఖ్య సభ్యులు లక్ష్మి, బృందన, మంజుల తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య అందించాలి

ఇంద్రవెల్లి: విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. మండలకేంద్రంలోని ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ను బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. పలువురు విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రేఖారాణి, డీఈ శివప్రసాద్‌, తదితరులున్నారు.

అప్రమత్తంగా ఉండాలి

కై లాస్‌నగర్‌: జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు, పెట్రోల్‌ బంక్‌ డీలర్లతో బుధవారం జూమ్‌ ద్వారా కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇంధన కొరత తలెత్తకుండా నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వినియోగదారులు అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేసుకునే పరిస్థితి రాకుండా అవగాహన కల్పించడంతో పాటు కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. చమురు సంస్థల ప్రతినిధులతో సమన్వయం కొనసాగిస్తూ జిల్లాకు అవసరమైన ఇంధన కోటాను సకాలంలో తెప్పించుకోవాలని డీలర్లకు సూచించారు. జిల్లాలో ఎక్కడా ‘నో స్టాక్‌’ బోర్డులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని, అత్యవసర సేవల వాహనాలకు ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎలాంటి సమస్యలు లేదా సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 425 1939లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి నందిని, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సంబంధిత అధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement