1,856 మందికి తప్పిన తిప్పలు
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమ
ఈ నెల నుంచే అమల్లోకి
లబ్ధిదారుల్లో హర్షం
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సినల్‌లో విలీనమైనప్పటికీ ఏడేళ్లుగా మావలలోనే చేయూత పింఛన్ డబ్బులు పొందుతూ వచ్చిన వారి కష్టాలు ఎట్టకేలకు దూరమయ్యాయి. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కావడంతో పింఛన్‌ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయింది.
లబ్ధిదారులకు తప్పిన తిప్పలు..
మున్సిపల్ వార్డుల పునర్విభజనలో భాగంగా మావల మేజర్ గ్రా మ పంచాయతీలో కొనసాగిన దస్నాపూర్, దోబి కాలనీ, దుర్గానగర్, హన్‌మాన్‌నగర్), కై లాస్‌నగర్, పిట్టలవాడ, రాంనగర్‌ర్, షాద్‌నగర్, సుభాష్‌నగర్‌ర్,, టీచర్స్‌కాలనీ, కేఆర్‌కే కాలనీతోపాటు బట్టిసావర్‌గాం పంచాయతీలో కొనసాగిన టైలర్స్‌కాలనీ, న్యూహౌసింగ్‌బోర్డుకాలనీతో పాటు అనుకుంట, రాంపూర్ పంచాయతీలను 2019లో మున్సిపల్ పరిధిలోకి చేర్చారు. పట్టణపరిధిలోని చేయూత పించన్‌దారులకు డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండగా.. గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా చెల్లిస్తున్నారు. అయితే ఈ కాలనీలు ము న్సిపల్‌లో విలీనమై ఏడే ళ్లు గడిచినా వీరికి మా త్రం పోస్టాఫీసుల ద్వా రానే చెల్లిస్తూ వచ్చారు. దీంతో పింఛన్ తీసుకునేందుకు లబ్ధిదారులు ప్రతి నెలా దస్నాపూర్, మావల మండలకేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఈక్రమంలో వారి ఇక్కట్లను ప లువురు కలెక్టర్ రాజర్షిషాకు దృష్ట కి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన తా జాగా వారికి మున్సిపల్ ద్వారానే పింఛన్ అందేలా చూడాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎట్టకేలకు బ్యాంకు ఖాతాల్లోనే ...
కలెక్టర్ ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన సిబ్బంది ఈ నెల నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ జమ చేస్తున్నారు. మొత్తం 1856 మంది ఉండగా ఇందులో 1,797 మంది ఈకేవైసీ పూర్తయింది. ఇంకా 59 మంది పూర్తికాకపోవడంతో వారికి వచ్చే నెలలో రెండు నెలలది కలిపి జమ చేస్తామని డీఆర్డీవో అధికారులు చెబుతున్నారు.
మున్సిపల్ పరిధిలో చేరిన
లబ్ధిదారుల వివరాలు..
కాలనీ లబ్ధిదారుల
సంఖ్య
దస్నాపూర్ 305
దోబీకాలనీ 104
దుర్గానగర్ 64
హన్‌మాన్‌నగర్ 58
న్యూహౌసింగ్‌బోర్డు 82
కై లాస్‌నగర్ 50
పిట్టలవాడ 187
రాంనగర్ 450
షాద్‌నగర్ 27
సుభాష్‌నగర్ 151
టైలర్స్‌కాలనీ 50
టీచర్స్‌కాలనీ 58
శ్రీరాంకాలనీ, కేఆర్‌కే,దుర్గానగర్ 150
అనుకుంట 120
బ్యాంకు ఖాతాల ద్వారా జమ చేస్తున్నాం
పట్టణ పరిధిలోని 13 కాలనీల పెన్షన్‌దారులకిచ్చే సొమ్మును నేరుగా మున్సిపాలిటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించాం. వాటితో పాటు అనుకుంట, రాంపూర్ కాలనీలను సైతం దీని పరిధిలోకి తీసుకువచ్చాం. అయితే ఇంకా 59 మంది పెన్షన్‌దారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్టివేట్ (ఈకేవైసీ) చేయించుకోలేదు. వారు వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలి. బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డుతో కూడిన వివరాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలి. మిగతా లబ్దిదారుల పెన్షన్ మాత్రం ఈ నెల నుంచి వారి బ్యాంకు ఖాతాల ద్వారానే జమ చేస్తున్నాం. – జాదవ్ శేష్‌రావు, ఏపీఎం
మావల, బట్టిసావర్గాం పంచాయతీల పరిధిలోని కాలనీల్లోని పింఛన్‌దారులకు మాత్రమే బ్యాంకు అకౌంట్‌లో పింఛన్ జమ చేయాలని అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం నుంచి 4వ వార్డులో విలీనమైన అనుకుంట, అదే మండలంలోని 17వ వార్డులో విలీనమైన రాంపూర్ గ్రామాన్ని ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఈ పరిస్థితిని వివరిస్తూ ‘సాక్షి’లో గతేడాది అక్టోబర్ 8న ప్రచురితమైన కథనంలో ప్రస్తావించడం జరిగింది. స్పందించిన అధికారులు తాజాగా ఈ రెండు కాలనీల్లోని లబ్ధిదారులను సైతం పట్టణ పరిధిలోకి తీసుకువచ్చారు. తాజా నిర్ణయంపై సదరు లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.


