వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సేవలు

Mar 25 2026 7:22 AM | Updated on Mar 25 2026 7:22 AM

ఆదిలాబాద్‌టౌన్‌: వేసవిలో విద్యుత్‌ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన సేవలు అందిస్తున్నామని ఆ శాఖ ఆపరేషన్‌ వరంగల్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌పై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో చీఫ్‌ ఇంజినీర్‌ అశోక్‌, ఎస్‌ఈ శేషారావు, డీఈ రాంసుబ్బారెడ్డి, శ్రీనివాస్‌, జనార్దన్‌రెడ్డి, శ్రావణ్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement