మహిళల భద్రతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు ప్రాధాన్యం

Mar 22 2026 5:28 AM | Updated on Mar 22 2026 5:28 AM

బోథ్‌: జిల్లాలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. మహిళా సి బ్బంది కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని మహిళా కానిస్టేబుళ్ల చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. రికార్డులు ఎప్పటికప్పుడు నవీకరించాలని, పెండింగ్‌ కేసులు పరిష్కరించి చార్జి షీట్‌లు దాఖలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ గురుస్వామి, ఎస్సైలు పురుషోత్తం, సంజయ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement