‘పరిషత్’లోనూ సత్తా చాటాలి
కై లాస్‌నగర్: డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ శు క్రవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి శాలు వాతో సత్కరించారు. ఆదిలాబాద్ ము న్సిపల్ పీఠాన్ని పార్టీ కై వసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన నరేశ్‌జాదవ్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాను న్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చా టాలని సూచించారు. ఆయన వెంట బోథ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రఫుల్‌రెడ్డి, సత్యనారాయణ, చంద్రశేఖర్ తదితరులున్నారు.


