సమస్యలు పరిష్కరించాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

Feb 21 2026 7:08 AM | Updated on Feb 21 2026 7:08 AM

సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

● మున్సిపల్‌ ఎదుట తుడుందెబ్బ ధర్నా

కై లాస్‌నగర్‌: తమ సమస్యలు పరిష్కరించాలనిడిమాండ్‌ చేస్తూ పట్టణంలోని కుమురంభీం కాలనీ వాసులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదు ట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోడం గణేశ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్‌ మాట్లాడుతూ, మావల మండలంలోని కుమురంభీం కాలనీలో 19 ఏళ్లుగా ఆదివాసీలు నివసిస్తున్నారని అన్నారు. విద్యుత్‌ సదుపాయం, ఇంటినంబర్‌ లేకపోవడంతో కనీస సౌకర్యాలకు నోచుకోక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంత రం కమిషనర్‌ జి.రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ముందుగా కాలనీ నుంచి మునిపల్‌ కార్యాలయం వరకు సంప్రదాయ వాయిద్యాలతో ర్యాలీ గా చేరుకున్నారు. కార్యక్రమంలో గోడం రేణుక, ఉయిక ఇందిర, విష్ణు, అశోక్‌, సందీప్‌, గణపతి, లలిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement