రైల్వే వంతెనల పనులు వేగవంతం
ఆదిలాబాద్: యుద్ధ ప్రాతిపదికన రైల్వే వంతెనల ని ర్మాణ పనులు చేపడతామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఆర్‌వోబీ పనుల పురోగతిని అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. రైల్వే అండర్ బ్రిడ్జ్, ఓవర్ బ్రిడ్జ్ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.104.50 కోట్ల నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనులు వేగవంతం అయ్యేలా చూస్తామన్నారు. భూ సేకరణ ప్రక్రియలో బాధితులకు పరిహారం త్వరితగతిన అందేలా చూస్తామన్నారు. ఎవరు కూడా పనులకు ఆటంకం కలిగించవద్దని కోరారు. మరో 25 రోజుల్లో విమానాశ్రయ సర్వే పనులు కూడా ఊపందుకుంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉన్న ఆదిలా బాద్ త్వరలోనే కార్పొరేషన్‌గా మారే అవకాశం ఉందని వివరించారు. ఆయన వెంట ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజు, బాలూరి గోవర్ధన్ రెడ్డి, డీఎస్పీ జీవన్ రెడ్డి, బీజేపీ నాయకులు జీవన్, రాకేష్, నగేష్‌రెడ్డి తదితరులున్నారు.


