భీష్మ ఏకాదశికి రత్నగిరిపై ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

భీష్మ ఏకాదశికి రత్నగిరిపై ఏర్పాట్లు

Jan 22 2026 8:25 AM | Updated on Jan 22 2026 8:25 AM

భీష్మ ఏకాదశికి రత్నగిరిపై ఏర్పాట్లు

భీష్మ ఏకాదశికి రత్నగిరిపై ఏర్పాట్లు

అన్నవరం: ఈ నెల 29వ తేదీన భీష్మ ఏకాదశి పర్వదినం సందర్బంగా సత్యదేవుని దర్శనానికి వేల సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఇబ్బంది కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఏర్పాట్లపై బుధవారం దేవస్థానం పండితులు, అధికారులతో దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు సమీక్షించారు.

తీసుకున్న నిర్ణయాలు

● 28 తేదీ అర్ధరాత్రి నుంచి సత్యదేవుని వ్రతాల నిర్వహణ, స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు

● క్యూలో భక్తులకు మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు అందజేయడం

● ప్రసాదాల విక్రయాలకు అదనపు కౌంటర్ల ఏర్పాటు, ఘాట్‌రోడ్‌లో ట్రాఫిక్‌ జామ్‌ అవ్వకుండా చర్యలు

● భీష్మ ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల నుంచి సర్క్యులర్‌ మండపం వద్ద భక్తులకు దద్దోజనం, పులిహోర పంపిణీ

● భక్తులందరికీ వసతి గదులు లభించే అవకాశం ఉండదు కనుక విశ్రాంతి మండపాలలో ఏర్పాట్లు

● దేవస్థానంలో పలుచోట్ల అదనపు టాయిలెట్స్‌ ఏర్పాటు

● రత్నగిరి, సత్యగిరుల మధ్య భక్తుల కోసం ఉచిత బస్సులు

● వార్షిక కల్యాణ మండపం వద్ద పుష్పాలతో రూపొందించిన భీష్ముడు, అర్జునుని కటౌట్‌ల ఏర్పాటు

● ఈ నెల 25వ తేదీ రథసప్తమి, ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా కూడా విస్తృత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement