కష్టపడి పనిచేసిన వారికి అన్యాయం
ఫ రాష్ట్రంలో ఒక్క జిల్లాకై నా రంగా పేరు పెట్టారా!
ఫ విలేకరులతో జనసేన నేత కొండలరావు
మామిడికుదురు: కష్టపడి పని చేసిన వారికి అన్యాయం జరుగుతోందని జనసేన నేత, పి.గన్నవరం నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడు కొమ్ముల కొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. పాశర్లపూడిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా కాపు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఏ ఒక్కరికి రుణాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో జనసేనకు చెందిన కాపు నేతలపై దాడి చేసి.. బాధితులపైనే జనసేన పార్టీకి చెందిన నేత దగ్గరుండి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం దారుణమన్నారు. దీన్ని ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు. రాష్ట్రంలో ఒక్క జిల్లాకై నా కాపు నేత వంగవీటి మోహనరంగా పేరు పెట్టారా అని ప్రశ్నించారు. దీనిపై ఏ ఒక్కరూ మాట్లాడకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఖర్చు పెట్టే నిధులను సబ్సిడీ రుణాలకు కేటాయించవచ్చు కదా అని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో కాపులకు, బీసీలకు పదవుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బీసీ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఓసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.


