మోడిఫైడ్ సైలెన్సర్ల తొలగింపు
కాకినాడ క్రైం: ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనచోదకులకు కాకినాడ ట్రాఫి క్–2 పోలీసులు ఝల క్ ఇచ్చారు. ట్రాఫిక్ సీఐ దానేటి రామారావు ఆధ్వర్యంలో వరస డ్రైవ్‌లు నిర్వహించి, ఆ వాహనచోదకులకు భారీ జరిమానాలు విధిస్తున్నారు. అలాగే మెకానిక్‌ను ఏర్పాటు చేసి, ఆయా వాహనాల నుంచి సైలెన్సర్లు తొలగిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం ఒక్కరోజే ట్రాఫిక్–2 పరిధిలో సీఐ రామారావు ఆధ్వర్యంలోని బృందం 162 సైలెన్సర్లను తొలగించింది. వాహన చోదకుల నుంచి సుమారు రూ.2.5 లక్షల జరిమానా వసూలు చేసింది.
నందరాడలో పక్షుల ఆవాసాలపై సర్వే
రాజానగరం: మండలంలోని నందరాడ పేరు వినగానే అందరికీ సినిమా షూటింగ్‌లు గుర్తుకు వస్తాయి. ఈ గ్రామంలో సీతారామయ్య గారి మనుమరాలు, సీతారామరాజు వంటి వివిధ చిత్రాలను చిత్రీకరించారు. పక్కా పల్లెటూరు వాతావరణంతో కూడిన ఈ గ్రామం ప్రస్తుతం వివిధ రకాల పక్షులకు ఆవాసంగా కూడా మారింది. ఈ గ్రామాన్ని జిల్లా అటవీశాఖ గణాంక విభాగానికి చెందిన అధికారులు మంగళవారం సందర్శించారు. నియోజకవర్గంలోనే పెద్ద సాగునీటి చెరువుగా ఉన్న ఏవీ ట్యాంకు పరిసరాలలో పక్షుల ఆవాసాలపై సర్వే నిర్వహించారు. ఈ ట్యాంకు చుట్టూ ఉన్న చెట్లపై 40 రకాల జాతులకు చెందిన సుమారు వెయ్యి పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయని గుర్తించారు. వీటిలో రెండు, మూడు రకాల విదేశీ పక్షులు కూడా ఉన్నట్టు నిర్ధారించారు. సర్వేలో అటవీశాఖ సిబ్బందితో పాటు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ జియాలజీ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
తుని: స్థానిక జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి చెందాడు. ఎస్సై జి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్ చివరిలో పెద్దపల్లి రైల్వే గేటు మధ్యలో సోమవారం రాత్రి సుమారు 60 నుంచి 65 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతున్నాడు. అతడిని విశాఖపట్నం నుంచి చైన్నె వైపు వెళుతున్న ప్రత్యేక సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం నుజ్జునుజ్జు కావడంతో గుర్తు పెట్టలేని విధంగా ఛిద్రమైంది. మృతుడు ఒంటిపై లుంగీ, జర్కిన్ చిరిగిపోయి ఉన్నాయి. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మోడిఫైడ్ సైలెన్సర్ల తొలగింపు


