● యూజ్‌ కేస్‌ చాలెంజ్‌లో నార్నూర్‌ ఆస్పిరేషనల్‌ బ్లాక్‌కు అవార్డులు ● జిల్లాకు దక్కిన అరుదైన గుర్తింపు ● కలెక్టర్‌ పాలన దక్షతకు నిదర్శనం | - | Sakshi
Sakshi News home page

● యూజ్‌ కేస్‌ చాలెంజ్‌లో నార్నూర్‌ ఆస్పిరేషనల్‌ బ్లాక్‌కు అవార్డులు ● జిల్లాకు దక్కిన అరుదైన గుర్తింపు ● కలెక్టర్‌ పాలన దక్షతకు నిదర్శనం

Oct 13 2025 7:20 AM | Updated on Oct 13 2025 7:20 AM

● యూజ

● యూజ్‌ కేస్‌ చాలెంజ్‌లో నార్నూర్‌ ఆస్పిరేషనల్‌ బ్లాక్‌

● యూజ్‌ కేస్‌ చాలెంజ్‌లో నార్నూర్‌ ఆస్పిరేషనల్‌ బ్లాక్‌కు అవార్డులు ● జిల్లాకు దక్కిన అరుదైన గుర్తింపు ● కలెక్టర్‌ పాలన దక్షతకు నిదర్శనం

కై లాస్‌నగర్‌: జిల్లాకు మరోసారి జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆస్పిరేషనల్‌ బ్లాక్‌లలో భాగంగా నీతి ఆయోగ్‌ చేపట్టిన ‘యూజ్‌ కేస్‌ చాలెంజ్‌’లో జిల్లా ఏకంగా నాలుగు అంశాల్లో పురస్కారాలు సా ధించింది. నార్నూర్‌ ఆస్పిరేషనల్‌ బ్లాక్‌లో విద్య, సామాజికాభివృద్ధి, ఆరోగ్యం, పోషణ విభాగాల్లో సాధించిన ప్రగతికి గాను అవార్డులతో పాటు నగ దు పురస్కారాన్ని అందుకోవడం కలెక్టర్‌ రాజర్షి షా సమర్ధతకు నిదర్శనం. ఇదివరకే ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుని జాతీ యస్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటిచెప్పారు.

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచేలా..

నార్నూర్‌ మండలంలోని 34 ప్రభుత్వ పాఠశాలల్లో ని 202మంది పేద విద్యార్థుల ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని పెంచేలా ‘ఇంప్రూవింగ్‌ సాఫ్ట్‌ స్కిల్స్‌ అ మాంగ్‌ ద స్టూడెంట్స్‌’ థీమ్‌ అమలు చేశారు. విద్యార్థుల్లో క మ్యూనికేషన్‌ నైపుణ్యాలను మెరుగుపరచడం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం తదితర స్కిల్స్‌ పెంచేదిశగా ప్రత్యేక శ్రద్ధ వహించారు. ముఖ్యంగా నార్నూ ర్‌ బ్లాక్‌ పరిఽధిలో ఇంగ్లిష్‌ ఫౌండేషన్‌ లెర్నింగ్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపర్చేలా బేస్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహించారు. టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రత్యేక మాడ్యుల్స్‌ను అందజేసి పక్కాగా అమలుపరిచారు. ఇదీ విజయవంతమై విద్యార్థుల భాషా నై పుణ్యం మెరుగుపడేలా చేసింది. ఇందుకు రూ.2లక్షల నగదు బహుమతి సాఽధించింది.

విద్యా విభాగంలో..

సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థుల్లోని చెడు అ లవాట్లను దూరం చేసి చదువులో రాణించేలా కలెక్టర్‌ రాజర్షి షా ప్రత్యేకంగా ఆరోగ్య పాఠశాలను అ మలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 81 పాఠశాలల్లో దీ న్ని అమలు చేస్తుండగా 39వేల మంది విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు నిత్యం రోజుకో అంశంలో తర్ఫీదునిస్తున్నారు. గుట్కా, పాన్‌, తంబాకు లాంటి వాటిని వాడకుండా చూడటంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్ర త ప్రాధాన్యతను చాటి చెబుతున్నారు. వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని నా ర్నూర్‌ బ్లాక్‌లోనూ పటిష్టంగా అమలుచేశారు. ప్రతీ వారం విద్యార్థులు, టీచర్లతో కలెక్టర్‌ ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ఆరోగ్యపరంగా గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. విద్యార్థులతో పాటు వారి కుటుంబీకులు చెడు అలవాట్లు మానుకునేలా తోడ్పడింది. ఈ కార్యక్రమానికీ రూ.లక్ష పురస్కారం అందుకుంది.

సామాజికాభివృద్ధి విభాగంలో..

నార్నూర్‌ ఆస్పిరేషనల్‌ బ్లాక్‌కు ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించారు. ఈ బ్లాక్‌ పరిధిలో విద్య, వైద్యం ఆరోగ్యం, పోషకాహారంతో పాటు వ్యవసాయం, ఆర్థిక చేయూత, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు లాంటి వివరాలన్నింటినీ అందులో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. ఆయా వివరాలు రా ష్ట్ర, జాతీయ స్థాయిలో ఏ విధంగా అమలవుతున్నా యి.. జిల్లా స్థాయిలో వాటి అమలు ఎలా ఉందనే దానిపై పూర్తి గణాంకాలతో ఎప్పటికప్పుడు నమో దు చేస్తున్నారు. నీతి ఆయోగ్‌ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేస్తూ వివరాలు పొందుపరుస్తున్నారు. ఆయా ప్యారామీటర్ల ను గణాంకాలతో నిర్దేశించుకుని జిల్లాకు అవార్డు, రూ.లక్ష నగదు పురస్కారం ప్రకటించారు.

నార్నూర్‌ ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ వివరాలు

గ్రామాలు 24

కుగ్రామాలు 34

జనాభా 29,152

పీహెచ్‌సీలు 1

అంగన్‌వాడీ కేంద్రాలు 77

ఆరోగ్య ప్రమాణాలను పెంచడంతో పాటు చిన్నారులు, విద్యార్థులకు పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందించేలా పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేశారు. జిల్లాలోని 17 కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు శానిటరీ న్యాప్‌కిన్స్‌ పంపిణీ చేసి వ్యక్తిగత పరిశు భ్రత ప్రాధాన్యతను తెలియజేశారు. 10వేల మంది విద్యార్థినులకు ప్రయోజనం చేకూర్చేలా 40 పాఠశాలల్లో శానిటరీ న్యాప్‌కిన్‌ వెండింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నారు. నార్నూర్‌ బ్లాక్‌లో మూడు హ్యాబిటేషన్లలో టెలి మెడిసిన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు. తాగునీటి వసతి కలిగిన అంగన్‌వాడీ కేంద్రాలు రాష్ట్రస్థాయిలో 47.6శాతం ఉండగా నార్నూర్‌లో వందశాతం, మరుగుదొడ్డి ఉపయోగించే కేంద్రాలు రాష్ట్రంలో 36.8శాతం ఉంటే నార్నూర్‌లో 32.46 శాతంగా ఉన్నాయి. ఐదేళ్లలోపు చిన్నారుల్లో పోషకాహారలోపం రాష్ట్రస్థాయిలో 3.3 శాతంగా ఉంటే నార్నూర్‌ బ్లాక్‌లో 2.70శాతానికి తగ్గించారు. ఐదేళ్లకు పైబడిన చి న్నారుల్లో తీవ్రమైన పోషకాహారలోపం రాష్ట్రస్థాయిలో 1.1శాతంగా ఉండగా నార్నూర్‌ బ్లాక్‌లో 0.5 శాతానికి తగ్గించారు. 2,500 గ్రాముల కంటే తక్కువ బరువుతో జన్మించిన శిశువుల శాతం రాష్ట్రంలో 7.8శాతం ఉండగా ఈ బ్లాక్‌లో జీరోకు తగ్గించారు. అలాగే ఆస్పత్రి ప్రసవాలు రాష్ట్రంలో 87.8శాతం ఉండగా జిల్లాలో వందశాతం జరిగేలా శ్రద్ధ వహిస్తున్నారు. ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్లు 87.8శాతం ఉండగా జిల్లాలో వందశాతానికి తీసుకువచ్చారు. పోషణ్‌ అభియాన్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేసి రూ.లక్ష నగదు పురస్కారాన్ని సాధించారు.

● యూజ్‌ కేస్‌ చాలెంజ్‌లో నార్నూర్‌ ఆస్పిరేషనల్‌ బ్లాక్‌1
1/2

● యూజ్‌ కేస్‌ చాలెంజ్‌లో నార్నూర్‌ ఆస్పిరేషనల్‌ బ్లాక్‌

● యూజ్‌ కేస్‌ చాలెంజ్‌లో నార్నూర్‌ ఆస్పిరేషనల్‌ బ్లాక్‌2
2/2

● యూజ్‌ కేస్‌ చాలెంజ్‌లో నార్నూర్‌ ఆస్పిరేషనల్‌ బ్లాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement