
ప్లానింగ్ పక్కాగా..
కై లాస్‌నగర్: ఉపాఽధిహామీ పథకం అమలులో అక్రమాలను కట్టడి చేసేందుకు కేంద్రం అనేక సంస్కరణలు తీసుకువస్తోంది. తాజాగా ఒకేచోట పనులు చేపట్టడానికి ఆస్కారం లేకుండా పనుల ప్లానింగ్‌ను పక్కాగా అంచనా వేసేందుకు యుక్తధార జియో స్పెషియల్ ప్లానింగ్ పోర్టల్‌ను అందుబాటులోకి తె చ్చింది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) భువన్ పోర్టల్ ఆధారంగా అధికారులు పనులను ఆన్‌లైన్‌లో గుర్తించనున్నారు. అంచనాల తయారీ నుంచి పనుల మంజూరు, బిల్లుల చెల్లింపు లాంటి పనులన్నీ ఇక నుంచి ఈ పోర్టల్ ద్వారానే జరగనున్నాయి. దీంతో అక్రమాలకు పూర్తిగా చెక్‌పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అక్రమాలకు తావు లేకుండా..
ఉపాధిహామీలో కొన్నిచోట్ల పనులు చేయకున్నా చే సినట్లు రికార్డులు నమోదు చేసి క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. సో షల్ ఆడిట్‌లోనూ ఇలాంటివి బయటపడుతున్నా యి. ఇందుకు తావులేకుండా యుక్తధార పోర్టల్ తో డ్పడనుంది. గ్రామాల్లో పనులు చేపట్టే ప్రాంతాల ను ఈ యాప్‌లో ఆన్‌లైన్ ద్వారా లైవ్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇస్రో భువన్ పోర్టల్ ద్వారా చేపట్టనుండగా ఇదివరకు ఆ ప్రాంతంలో పనులు చే పట్టారా.. పనులు చేసేందుకు ఆ ప్రాంతం అనుకూలంగా ఉందా.. లేదా? అనే వివరాలు చెప్పడంతో పాటు ఆ ప్రాంతం ఫొటోలనూ ప్రత్యక్షంగా చూపిస్తుంది. దీంతో పనులు చేపట్టే ప్రాంతాలనే ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాలను గుర్తించే ప నిలో టెక్నికల్ అసిస్టెంట్లు నిమగ్నమయ్యారు. ఏ వి ధంగా పనుల అంచనాలు గుర్తించాలనేదానిపై ఇది వరకే అధికారులు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప నులు మంజూరయ్యాక నిర్దేశిత ప్రాంతంలోనే పనులు చేయాల్సి ఉంటుంది. పనులు చేయకముందు ఒకసారి, 60శాతం పనులు పూర్తయ్యాక, 90 నుంచి వంద శాతం పనులు పూర్తయ్యాక ఇలా మూడుసార్లు ఆ ప్రాంతం ఫొటోలు తీసుకుంటారు. దాన్ని నిర్ధారించాకే కూలీలకు బిల్లులు మంజూరవుతాయి.
గ్రామానికో లాగిన్ ఐడీ
వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెక్నికల్ అసిస్టెంట్లు జిల్లాలో ఎలాంటి పనులు చేపట్టాలో గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ గ్రామానికో లాగిన్ ఐడీని క్రియేట్ చేశారు. వాటి ఆధారంగా యుక్తధార పోర్టల్‌లో పనులు చేపట్టే ప్రాంతాలను వారు నమో దు చేయనున్నారు. ఈ ప్రక్రియ సోమవారం నుంచి మొదలయ్యే అవకాశమున్నట్లు అధికారులు చెబు తున్నారు. గ్రామానికి సంబంధించి ఉపాధి పనులకు హాజరైన కూలీల మూడేళ్ల వివరాలు తీసుకుంటారు. అందులో సంవత్సరం వారీగా ఎంతమంది పనులకు వచ్చారనే వివరాలను యావరేజ్‌గా తీసుకుని చేపట్టాల్సిన పనులు, మెటీరియల్ కాంపొనెంట్‌ను కలిపి లేబర్ బడ్జెట్ ప్రణాళికను సిద్ధం చేస్తా రు. ఈ వివరాల ఆధారంగా పనులు మంజూరు చే యడంతో పాటు బడ్జెట్ కేటాయింపులు, కూలీలకు బిల్లుల చెల్లింపులు తదితర పనులన్నీ ఇక నుంచి ఈ పోర్టల్ ద్వారానే చేపట్టనున్నారు. నేరుగా కేంద్ర మే వీటిని పర్యవేక్షించనుంది. ఫలితంగా రాష్ట్ర ప్రమేయం తగ్గి అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.
17 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా..
యుక్తధార పోర్టల్‌ను అమలు చేసేందుకు పైలెట్ ప్రాజెక్ట్ కింద గతేడాది మండలానికో గ్రామం చొ ప్పున జిల్లాలోని 17 గ్రామాలను ఎంపిక చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో అంకాపూర్, బేల మండల కేంద్రం, జైనథ్‌లో నిరాల, తలమడుగులో కుచులాపూర్, తాంసిలో జామిడి, నార్నూర్‌లో గుంజాల, ఇంద్రవెల్లిలో దేవాపూర్, గుడిహత్నూర్‌లో శంభుగూడ, ఇచ్చోడలో బోరిగామ, బజార్‌హత్నూర్‌లో దహెగాం, బోథ్‌లో కౌట, ఉట్నూర్‌లో ధన్‌పూర్, నేరడిగొండలో కుంటాల–కే, భీంపూర్‌లో మర్కగూడ, గాదిగూడలో పర్సువాడ (కే), మావలలో వాగాపూర్, సిరికొండలో రిమ్మ గ్రామాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆయాచోట్ల ఈ విధానం విజయవంతం కావడంతో ప్రస్తుతం ప్రతీ గ్రామంలో దీనిని అమలు చేయనున్నారు.
పారదర్శకత పెంచేందుకే..
ఉపాఽధిహామీ పనుల్లో పారదర్శకత పెంచాలనే ఉద్దేశంతోనే కేంద్రం యుక్తధార పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. గ్రామ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు అవకాశం ఉందా.. అనేదాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించి ప్రాంతాలను ఎంపిక చేయనున్నాం. గతంలో కొండ ప్రాంతాల్లో ఇంకుడుగుంతలు, ఫాంపాండ్స్ లాంటి నిర్మాణాలు చేపట్టారు. అలాంటి అవకాశం లేకుండా ఎత్తు, పల్లాలను గుర్తించి పనులు చేసేందుకు వాస్తవంగా అవకాశం ఉందా.. అనే దాన్ని గుర్తించేందుకు ఈ విధానం తోడ్పడుతుంది.
– కుటుంబరావు, అడిషనల్ డీఆర్డీవో