
‘కేంద్ర పథకాలతో ప్రయోజనం శూన్యం’
ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ పథకాలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న విమర్శించారు. ఆదివా రం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతు వ్యతిరేక విధానాలతో విఫలమైన మోదీ ప్రభుత్వం ఇప్పుడు పథకాల పే ర్లు మార్చి మళ్లీ రైతులను మోసం చేస్తోందని ఆరో పించారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు లబ్ధిదా రుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో మాత్రం రైతుల సంఖ్య 59లక్షల నుంచి 33లక్షలకు పడిపోయిందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ధన్, ధాన్య కృషి యోజనలో జిల్లాను చేర్చకపోవడం స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధుల వైఫల్యమని విమర్శించారు. వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎరువులు, విత్తనాలు, మందులపై సబ్సిడీ తగ్గించి, ధరలు పెంచు తూ రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు కుమ్రా రాజు, గంగయ్య, ధమ్మపాల్, కనక రమణ, శుక్లల్, అశోక్, భూమన్న తదితరులున్నారు.