
పెద్దగా ఒరిగేదేం ఉండదు
జిల్లాకు ముగ్గుర్ని ఎంపిక చేసి విదేశాలకు పంపడం వల్ల ఇక్కడి విద్యావిధానంలో పెద్దగా ప్రయోజనాలేం ఉండకపోవచ్చు. మన దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న విద్యాబోధన ప్రక్రియలు అధ్యయనం చేయడం మేలు. ఆయా దేశాల్లో సామాజిక ఆర్థిక కోణాలు మన దేశానికి భిన్నంగా ఉంటాయి. కాబట్టి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడి పొరుగు రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయడం సమంజసంగా ఉంటుంది. – దాసరి శంకర్,
టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడు, నిర్మల్
విప్లవాత్మక మార్పులకు అవకాశం
ఎంపికై న ఉపాధ్యాయులు విదేశాల్లోని విద్యావిధానాలు, బోధన పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా నూతన విషయాలు తెలుసుకుంటారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గ్రహించిన అంశాలను అమలుపరచడం ద్వారా ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంటుంది.
– తోట నరేంద్రబాబు,
పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్

పెద్దగా ఒరిగేదేం ఉండదు