
లక్ష్మీనారాయణుడిపై సూర్యకిరణాలు
జైనథ్: మండల కేంద్రంలోని ప్ర సిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఆదివా రం నుంచి స్వా మివారి మూలవిరాట్టుపై సూ ర్యకిరణాలు ప డుతున్నాయి. స్వామివారి పా దాల నుంచి వి గ్రహం మొత్తం తాకుతూ వెళ్తుంటాయి. సూర్య కిరణాలు తాకుతున్న సమయంలో స్వామివారు సువర్ణ ఆకృతితో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో స్వామి వారిని దర్శించుకుంటే సకల దోషాలతో పాటు చర్మవ్యాధులు తొలగుతాయని భక్తుల నమ్మ కం. కుటుంబ సభ్యుల్లో సుఖఃశాంతులు కలు గుతాయని విశ్వాసం. కాగా, అక్టోబర్, ఫిబ్రవరి నెలల్లో ఏటా రెండుసార్లు విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకుతూ ఉంటాయి.