
దసరా మహోత్సవానికి తరలిరండి
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని దసరా మైదా నంలో ఈనెల 2న నిర్వహించనున్న దసరా మహోత్సవానికి హిందూ బంధువులంతా తరలిరావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరా రు. స్థానిక దస్నాపూర్ కాలనీలోని మైదానంలో హిందూ సమాజ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా విజయదశమి ఉత్సవా లను ఏటా నిర్వహించుకుంటున్నట్లు తెలిపా రు. ఆయనవెంట ఉత్సవ సమితి అధ్యక్షుడు హనుమాండ్లు, నాయకులు భరత్, కృష్ణయాద వ్, జ్యోతిరెడ్డి,దాము,రాకేశ్ తదితరులున్నారు.