
● ఉట్నూర్‌లో సద్దుల సంబురం
బతుకమ్మ ఎత్తుకున్న చిన్నారి
ఉట్నూర్‌లో బతుకమ్మ జోష్‌లో యువతులు
ఉట్నూర్‌తో పాటు మండలవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబ రాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను కూడళ్లలో ఉంచి మహిళలు, యువతులు చిన్నారులు ఆడిపాడారు. అనంతరం గంగన్నపేట చెరువుకు చేరుకుని బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఉట్నూర్ పాత బస్టాండ్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బతుకమ్మలకు స్వాగతం పలికారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. – ఉట్నూర్‌రూరల్

● ఉట్నూర్‌లో సద్దుల సంబురం