
పర్ధాన్ తెగకు గుర్తింపునివ్వాలి
ఆదిలాబాద్‌రూరల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్ని కల్లో ఆదివాసీ పర్ధాన్ తెగకు అన్ని రా జకీయ పార్టీలు గుర్తింపు నివ్వాలని పలువురు పర్ధాన్ సమాజ్ నాయకులు కోరారు. జిల్లా కేంద్రంలో ని అంబేద్కర్ భవనంలో మంగళవారం వారు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీ పర్ధాన్ సమాజ్‌కు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జిల్లాలోని ప్రతీ మండలంలో పర్ధాన్ సమాజ్ ఓటు బ్యాంకు కలిగి ఉందన్నారు. గిరిజనేతరుల మద్ధతు సైతం తమకు సంపూర్ణంగా ఉందని, ఈమేరకు ఆయా పార్టీ లు గుర్తించాలని కోరారు. ఇందులో నాయకులు యాదవ్‌రావ్, ఆనంద్ రావ్, శంకర్, దే విదాస్, సురేష్, సుభాష్, దిగంభర్, జనార్దన్, విలాస్, అశోక్, దేవిదాస్ పాల్గొన్నారు.