ఈకేవైసీ పూర్తయితేనే ‘రేషన్‌’ | - | Sakshi
Sakshi News home page

ఈకేవైసీ పూర్తయితేనే ‘రేషన్‌’

Sep 24 2025 5:11 AM | Updated on Sep 24 2025 5:11 AM

ఈకేవైసీ పూర్తయితేనే ‘రేషన్‌’

ఈకేవైసీ పూర్తయితేనే ‘రేషన్‌’

● లేకుంటే కార్డు రద్దయ్యే అవకాశం ● జిల్లాలో 70శాతం మాత్రమే నమోదు ● ఈనెలాఖరు వరకే గడువు

కై లాస్‌నగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా రేషన్‌కార్డులు జారీ చేసింది. నూతన లబ్ధిదారులు ఈ నె ల బియ్యం కోటా కూడా తీసుకున్నారు. అయితే వా రంతా రెగ్యులర్‌గా రేషన్‌ తీసుకోవాలంటే సంబంధిత రేషన్‌ షాపులో ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. లేనిపక్షంలో కార్డు రద్దుతో పాటు బియ్యం పంపిణీ సైతం నిలిచిపోయే అవకాశముంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు విధించి ంది. అయితే జిల్లావ్యాప్తంగా ఇంకా 4లక్షల మంది కి పైగా కార్డుదారులు నమోదు చేసుకోవాల్సిఉంది.

ఉద్దేశమేంటంటే..

కార్డుదారుల్లో మరణించిన సభ్యుల పేరిట కూడా బియ్యం తీసుకుంటున్నారు. కొంత మంది నెలల తరబడి రేషన్‌ తీసుకోవడం లేదు. అనర్హుల ఏరివేతతో పాటు బియ్యం పంపిణీలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండేళ్లుగా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. లబ్ధిదారుల ఆధార్‌లో పొరపాట్లు దొర్లడం, కార్డులు అప్‌డేట్‌ చేసుకోకపోవడం వంటి కారణాలతో నమోదులో తీవ్ర జాప్యం అవుతోంది. కార్డుదారులు వాటిని సరిచేసుకునేందుకు ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరిగినా సకాలంలో అప్‌డేట్‌ కాని పరిస్థితి. ఈ క్రమంలో కేంద్రం పలుమార్లు గడువు పెంచుతూ వచ్చింది. తొలుత ఈ ఏడాది మార్చి 31వరకు ఉండగా దానిని జూన్‌ నెలాఖరు వరకు పొడిగించినా పూర్తి కాలేదు. దీంతో మరోసారి ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా రేషన్‌ కార్డులను జారీ చేసింది. దీంతో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. మరో వారం మాత్రమే గడువు ఉండటంతో ప్రక్రియ పూర్తి కావడం ప్రశ్నార్థకమేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో కొత్తగా మంజూరు చేసిన వాటితో కలిపి ప్ర స్తుతం రేషన్‌ కార్డుల సంఖ్య 2,14,429కి చేరింది. ఇందులో సభ్యుల సంఖ్య 7,06,302 మంది ఉన్నా రు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4,95,386 మంది ఈకేవైసీ నమోదు చేసుకున్నారు. మరో 2,10,916 మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. వీ రంతా సంబంధిత రేషన్‌ డీలర్లను సంప్రదించాలి. ఆధార్‌, రేషన్‌కార్డు నంబర్ల ఆధారంగా వారి వద్దనున్న పీవోఎస్‌ మిషన్‌లో లబ్ధిదారుల ఫింగర్‌ఫ్రింట్స్‌ నమోదు చేస్తారు. ఇలా రేషన్‌కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేస్తారు. లేనిపక్షంలో కార్డు రద్దుతో పాటు బియ్యం సరఫరా సైతం నిలిపివేసే అవకాశమున్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి.

జిల్లాలో..

రేషన్‌ దుకాణాలు : 356

కొత్తగా జారీ చేసిన కార్డులు : 21,672

మొత్తం రేషన్‌కార్డులు : 2,14,429

ఈకేవైసీ నమోదు చేసుకున్నవారు : 4,95,386

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement