
రోగులకు నాణ్యమైన వైద్యసేవలు
ఆదిలాబాద్‌టౌన్/ఆదిలాబాద్‌రూరల్: ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన డీఎంహెచ్‌వో చాంబర్‌లో అధికారులతో సమావేశమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ముందస్తుగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను నియమించినట్లు పేర్కొన్నారు. అలాగే అన్ని పీహెచ్‌సీల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో సికిల్‌సెల్ ఎనీ మియా వైద్యసేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వస్త్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2 వరకు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య నిపుణుల ద్వారా వైద్య శిబి రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్తులకు పోషణ కిట్లు అందజేశారు. క్షయ బాధితులకు సేవలందిస్తున్న ఉద్యోగులకు సర్టిఫి కెట్లు అందజేసి ప్రశంసించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని అంకోలి పీహెచ్‌సీని సందర్శించి వైద్యసేవలు అందుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, టీబీ నియంత్రణ అధికారి సుమలత, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధ న, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్, మలేరియా నివారణ అధికారి శ్రీధర్, డీపీఎం వామన్‌రావు, అంకోలి పీహెచ్‌సీ వైద్యుడు సర్పరాజ్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.