
జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు మేలు
ఆదిలాబాద్: జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం జీ ఎస్టీలో సమూల మార్పులు తీసుకొచ్చిందని తెలి పారు. గతంలో ఉన్న నాలుగు స్లాబులను రెండింటికి కుదించడం, అందులోనూ సామాన్యులకు ఉపయోగపడే అనేక వస్తువుల్లో పన్ను తొలగించడం శు భ పరిణామమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు మే లు జరుగుతుంటే కొన్ని పార్టీలు గగ్గోలు పెడుతున్నాయని విమర్శించారు. ఇంటి నిర్మాణ సామగ్రి ధ రలు తగ్గడం వల్ల పేదలకు, వ్యవసాయ పనిముట్ల ధరలు తగ్గడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. జీఎస్టీ ప్రయోజనాలను బీజేపీ కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఇందులో నాయకులు దినేశ్ మాటోలియా, క్రాంతికుమార్, ప్రవీణ్, వేదవ్యాస్, రాకేశ్, గంగాధర్, భీమ్సేన్ రెడ్డి, సూర్యకిరణ్ తదితరులున్నారు.