
సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
ఆదిలాబాద్‌రూరల్: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ ల ఆధ్వర్యంలో మంగళవారం అధికారికంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలను కలెక్టర్ ప్రారంభించారు. మహిళా ఉద్యోగులు, వి ద్యార్థినిలతో కలిసి దాండియా ఆడి ఉత్సాహపరి చారు. రాష్ట్రంలో ప్రకృతిని ప్రేమించే సంస్కృతి ఉందన్నారు. అందులో భాగంగానే పూలను పూ జిస్తూ మహిళలు ఏటా బతుకమ్మ సంబరాలను ఘ నంగా నిర్వహించుకుంటారన్నారు. ప్రభుత్వం కూడా ఈ పండుగకు ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, బతుకమ్మ సంబరాల చైర్‌పర్సన్ శ్యామలాదేవి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు సునీతకుమారి, రాజలింగు, మనోహర్, కలీం, డీడబ్ల్యూవో మిల్కా, ఏటీడీవో నిహారిక, ఆయా శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు అండగా ఉంటాం
ఆదిలాబాద్‌టౌన్: వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులతో పాటు పలు సామగ్రి కిట్లను మంగళవారం అందజేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన 75 మందికి కిట్లను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇళ్లు కూలిపోయిన బాధితులకు ఇందిరమ్మ పథకం రెండో విడతలో ప్రాధాన్యమిస్తామన్నారు. ఇందులో లయన్స్‌క్లబ్ గవర్నర్ భద్రేశం, చంద్రప్రకాశ్, వాసుదేవారెడ్డి, వెంకట్, రమాకాంత్, చంద్రమోహన్, సురేశ్‌బాబు, దేవన్న పాల్గొన్నారు.
తోషంలో వైద్యశిబిరం ప్రారంభం
గుడిహత్నూర్: మారుమూల పల్లెల్లో ఏటా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న సామాజిక సేవకుడు మదన్ గిత్తే సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని తోషంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. సుమారు 1200 మందికి పైగా రోగులకు వైద్యులు పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందించారు. ఇందులో అదనపు జిల్లా వైద్యాధికారి మనోహర్, తహసీల్దార్ కవితారెడ్డి, మండల వైద్యాధికారి శ్యాంసుందర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.