
బాలింతకు దారి కష్టాలు
ఇంద్రవెల్లి: సిరికొండ మండలంలోని మారుమూల కన్నాపూర్ పంచాయతీ పరిధి కన్నాపూర్‌తండాకు చెందిన మీనా నిండు గర్భిణి. ఆమె కు ఈ నెల 16న పురుటి నొప్పుల రాగా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మీనా మగ బిడ్డకు జ న్మినిచ్చింది. గురువారం వైద్యులు డిశ్చార్జి చే యగా 102వాహనంలో ఆమెను గ్రామానికి త రలిస్తుండగా మార్గమధ్యలో ఉన్న వాగు ఉధృతికి వాహనం దాటలేకపోయింది. దీంతో పైలె ట్ షేక్ సాహిద్ పసిబిడ్డతో ఉన్న బాలింతను వాగు దాటించారు. అక్కడి నుంచి సుమారు కి లోమిటర్ దూరం వరకు కాలినడకన వెళ్లి వారు గ్రామానికి చేరుకున్నారు.