
ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: నిరుపేద ఖైదీలు డిఫెన్స్ కౌ న్సిల్ అందించే ఉచిత న్యాయ సేవలను సద్వి నియోగం చేసుకోవాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం సూచించారు. గురువారం జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో కలిసి జిల్లా జైలును సందర్శించారు. న్యాయాన్ని పొందే విధానాన్ని ఖైదీలకు వివరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ఉమేశ్‌రావు డోలే, జాదవ్ సంగీత, తిలోత్తమ, రూపేశ్ ఉన్నారు.