
ఆకట్టుకున్న ఫ్రెషర్స్‌డే
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్‌డే నిర్వహించారు. విద్యార్థులు జానపద, సినీ గీ తాలపై నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నా రు. ప్రిన్సిపల్ సంగీత మాట్లాడుతూ.. సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య స్నేహభావం పెంపొందించేందుకు ఫ్రెషర్స్‌డే నిర్వహించిన ట్లు తెలిపారు. లెక్చరర్లు జగ్‌రాం, సంతోష్, శ్రావణి, చక్రవర్తి, అరుణ్‌కుమార్, రమాకాంత్, రవికిరణ్, శ్రీధర, జ్యోత్స్న, రాజ్‌కుమార్, అష్రఫ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.