
మోదీ నాయకత్వంలోనే దేశభద్రత
గుడిహత్నూర్: ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశ భద్రత సాధ్యమని ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక శివకల్యాణ మండపంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడారు. బీజే పీ ఉన్నంత వరకు దేశానికి ఎలాంటి ఆపద రాదని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, రైల్వే బోర్డు సభ్యుడు బోసారే గణేశ్, నాయకులు కేంద్రే శివాజీ, కేంద్రే లక్ష్మణ్, భరత్, వామన్‌గిత్తే, కేంద్రే కుమార్, రాజేంద్రప్రసాద్, బోడ్కే జగన్, స్థానిక బ్లడ్ మ్యాన్ లోఖండ్ అనిల్, రిమ్స్ వైద్య సిబ్బంది ఉన్నారు.
మోదీ పాలనలో దేశాభివృద్ధి
ఆదిలాబాద్: ప్రధాని మోదీ పాలనలో దేశాభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా గురువారం ఖానాపూర్ చెరువు కట్ట సమీపంలోని బతుకమ్మ ఘాట్ వద్ద సేవా పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రధాని మోదీ పరిపాలన దక్షతను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నెల 17నుంచి అక్టోబర్ 2వరకు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మా నంద్, నాయకులు విజయ్, కృష్ణ, రవి, రాజేశ్, దినే శ్ మటోలియా, రాజేశ్, ప్రవీణ్, ముకుంద్‌రావు, అశోక్‌రెడ్డి, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలో పలువురి చేరిక
సాత్నాల: మండలంలోని జామ్ని, జంగుగూడా గ్రామాలకు చెందిన పలువురు గురువారం బీజేపీలో చేరగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ మునిగిపోయే నావ అని ఎద్దేవా చేశారు. నాయకులు కరుణాకర్‌రెడ్డి, అస్తక్ సుభాష్, రమేశ్, రోహిదాస్, రాము, మీరాబాయి, రేణుక భాయ్, అశోక్‌రెడ్డి, ఆనంద్‌రావు, ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.

మోదీ నాయకత్వంలోనే దేశభద్రత