
‘బఫర్’ గండం!
వాగునీటి ప్రవాహానికి అడ్డంకిగా అడ్డగోలుగా అక్రమ కట్టడాలు వంద ఆక్రమణలున్నట్లు నిర్ధారణ బల్దియాకు ఏటా వరద ముప్పు కలెక్టర్ చర్యలపైనే సర్వత్రా ఆసక్తి
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణ పరిధిలోని బఫర్‌జోన్ ఆక్రమణల లెక్కతేలింది. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు కొద్దిరోజులుగా వివిధ కాలనీల్లోని వాగుల గుండా మున్సిపల్, ఇరిగేషన్‌శాఖల అధికా రులు సంయుక్త పరిశీలన చేపట్టారు. బఫర్‌జోన్ ప రిధిలో వందకు పైగా ఆక్రమణలున్నట్లు గుర్తించా రు. అక్రమ నిర్మాణాలకు బాధ్యులెవరనే ప్రశ్న తలెత్తుతుండగా, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదీ పరిస్థితి..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆదిలాబాద్ పట్ట ణంలోని పలు లోతట్టుప్రాంతాలు ముంపునకు గు రయ్యాయి. వాగులు, కాలువలు సాఫీగా ప్రవహించే మార్గం లేక వరద ఉప్పొంగి పలు కాలనీల్లో ఇండ్లలోకి వరదనీరు చేరింది. లోలెవల్ వంతెనలు ఉధృతంగా ప్రవహించడంతో పలు చోట్ల రాకపోకలు నిలిచాయి. వాహనాలు కొట్టుకుపోవడంతో పా టు రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిపై ఇ టీవల మున్సిపల్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌శాఖ అఽధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రా జర్షి షా ఈ పరిస్థితికి కారణమేంటనే దానిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. బ ఫర్‌జోన్‌లోని ఆక్రమణలు గుర్తించేందుకు మున్సి పల్, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్త పరిశీ లన చేపట్టి నివేదిక అందించాలని సూచించారు.
భారీ సంఖ్యలో ఆక్రమణలు
కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ టౌన్‌ప్లానింగ్, ఇరిగేషన్ శాఖ అధికారులు మావల అటవీ ప్రాంతం నుంచి గ్రీన్‌సిటీ వరకు ప్రవహించే వాగు బఫర్‌జోన్‌ను సందర్శించారు. దుర్గానగర్, కోజాకాలనీ, ఆదర్శనగర్, దస్నాపూర్, రాంనగర్, సుభాష్‌నగర్, గ్రీన్‌సిటీ కాలనీల్లోని వాగు గుండా ఉన్న నిర్మాణాలు పరిశీలించారు. వీటి పరిధిలోని వాగుకు ఇరువైపులా ఉన్న బఫర్‌జోన్‌లో భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. ఇండ్లు, వాణిజ్య భ వనాలతో పాటు ప్రహరీలు, మరుగుదొడ్లు, స్నానపుగదులు లాంటి వందకు పైగా అక్రమ నిర్మాణాలున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆదర్శనగర్, గ్రీన్‌సిటీలో వాగు నీటి ప్రవహం సాగకుండా అడ్డుగా నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. రాంనగర్, సుభాష్‌నగర్‌లో ఏకంగా వాగులోనే నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. సుభాష్‌నగర్‌లో వాగుకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలు బఫర్‌జోన్ పరిఽధిలోనే ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ఆ వివరాలతో కూడిన నివేదికను కలెక్టర్ రాజర్షి షాకు అందించనున్నారు.
ఈ దుస్థితికి బాధ్యులెవరు?
బఫర్‌జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఆదిలాబాద్ పట్టణ పరిధిలో ఇంత పెద్ద మొత్తంలో అక్రమ నిర్మాణాలు జరగడానికి బాధ్యులెవరనే ప్ర శ్న తలెత్తుతోంది. వాటిపై చర్యలు చేపట్టాల్సిన ము న్సిపల్, ఇరిగేషన్‌శాఖల అధికారులు ఏం చేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి చూసీచూడనట్లు వదిలేశారని, ఆయా శాఖల వైఫల్యంతోనే ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరదలు సంభవించడానికి ప రోక్షంగా ఆయా శాఖల తీరే కారణమనే అభిప్రా యం వినిపిస్తోంది. అయితే.. ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తారా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేస్తారా? అనేది చర్చనీయాంశమైంది.
స్వచ్ఛందంగా తొలగించుకోవాలి
బఫర్‌జోన్ పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాల కారణంగా వరదనీరు ఇళ్లలోకి వస్తోంది. పట్టణంలోని వాగు గుండా ఉన్న ఆక్రమణలను ఇరిగేషన్‌శాఖ అధికారులతో కలిసి గుర్తించాం. కలెక్టర్‌కు నివేదిక అందిస్తాం. కలెక్టర్ ఆదేశాలకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. ఆక్రమణదారులే స్వచ్ఛందంగా నిర్మాణాలు తొలగించుకోవడం మంచిది.
– సుమలత, పట్టణ ప్రణాళికాధికారి