
నెట్‌బాల్ ఎంపిక పోటీలు
ఇచ్చోడ: మండల కేంద్రంలోని సన్‌షైన్ స్కూల్‌లో గురువారం జిల్లా స్థాయి నెట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. బాలబాలికలకు జూ నియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు మల్లేశ్, బొంగురాల గౌతం తెలిపా రు. ప్రతిభ కనబరిచిన వారిని త్వరలో మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సీ నియర్ పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై పురుషోత్తం, పాఠశాల యాజమాన్యం రాకేశ్, గణేశ్, ప్రిన్సిపాల్ విజ య్, పీఈటీలు సాయిరాం, హరీశ్, అనూష, లక్ష్మి, క్రీడాకారులు పాల్గొన్నారు.