ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న సూరజ్‌సింగ్ రాష్ట్ర ఉత్తమ లెక్చరర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈయన ఇంద్రవెల్లి మండలంలోని అందునాయక్‌తండాకు చెందినవారు. 2002 నుంచి 2012 వరకు కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పని చేశారు. 2013 సెప్టెంబర్ 13న ఏపీపీఎస్సీ ద్వారా రెగ్యులర్ లెక్చరర్‌గా నియమితులయ్యారు. మొదట ఇచ్చోడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ లెక్చరర్‌గా పని చేశారు. ఆ తర్వాత గుడిహత్నూర్‌లో, ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నారు. ఈయన పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2009 నుంచి 2012 వరకు 230 మంది అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వగా 148 మంది డీఎస్సీలో హిందీ పండితులుగా నియమితులయ్యారు. చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకున్న ఆయన శిష్యురాలు శీతల్‌ను ప్రోత్సహించి హిందీ పండిత్‌గా ఉద్యోగం సాధించేలా ప్రోత్సహించారు. రాష్ట్రస్థాయిలో ఈమె మూడో ర్యాంక్ సాధించారు. శీతల్ కూడా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం విశేషం. క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన బోధన చేయడంతో సూరజ్‌సింగ్‌ను ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ లెక్చరర్ అవార్డుకు ఎంపిక చేసింది. నేడు హైదరాబాద్‌లో సీఎం చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు.
పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ..