
ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు
ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. గురువారం జి ల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉ పాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని శా లువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌కు పునాది వేయాలని, వారికి రోల్‌మోడల్‌గా నిలువాలని సూచించారు. పాఠశాలల్లో ఏఐ ద్వారా నాణ్యమైన విద్యాబోధన అందుతుందని తెలిపారు. కొందరు ఉపాధ్యాయులు వా గులు, వంకలూ లెక్కచేయకుండా పాఠశాలలకు వెళ్లి విద్యాబోధన చేయడం అభినందనీయమని పే ర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాని కి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చే స్తున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈవో, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్ర, మండల విద్యాధికారి సోమయ్య, సెక్టోరియల్ అధికారులు ఉదయశ్రీ, రఘురమణ, ఉష్కం తిరుపతి, కందుల గజేందర్, శ్రీహరిబాబు, గడ్డం శశికళ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొమ్ము కృష్ణకుమార్, అశోక్, సోగల సుదర్శన్, శ్రీనివాస్, గడుగు నరేందర్, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.