
గణపతిపూజలో మహరాజ్
నేరడిగొండ: మండలంలోని ఇస్పూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన గణపతి పూజకు భాష్చంద్, సూరజ్ మహరాజ్‌లు హాజరయ్యా రు. బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు. అ నంతరం గ్రామస్తులతో కలిసి గణపతి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ను శాలువాతో సన్మానించారు. వినాయకుడి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే రాజురా గ్రామంలోగల గణనాథుడిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయనను గ్రామస్తులు సన్మానించారు.