
నిమజ్జనోత్సవ ఏర్పాట్లు ముమ్మరం
కై లాస్‌నగర్: ఈ నెల 6న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జన శోభాయాత్రకు బల్ది యా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూట్‌మ్యాప్ ప్రకారం పట్టణంలోని 49వార్డుల పరిధిలోని వి నాయక విగ్రహాల శోభాయాత్ర నిర్వహించనున్న ప్రాంతాలు, ప్రధాన చౌక్‌లలో రోడ్లపై గుంతలను మొరం, స్టోన్‌డస్ట్‌తో పూడ్చివేస్తున్నారు. అడ్డు వచ్చే చెట్ల కొమ్మలు తొలగిస్తున్నారు. వేలాడే విద్యుత్ తీగలను సరి చేస్తున్నారు. ప్రత్యేక హైమాస్ట్ లైట్లు ఏ ర్పాటు చేస్తున్నారు. మజీద్‌ల వద్ద బారికేడ్లు ఏ ర్పాటు చేసి కవర్లతో కప్పేస్తున్నారు. శోభాయాత్ర తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం తాత్కాలిక టా య్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రసాద వితరణతో పాటు తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయనున్నా రు. నిమజ్జనం చేసే పెన్‌గంగా, చాందా వాగు వద్ద 10మంది చొప్పున గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రత్యేకంగా నీటిపై తేలియాడే తె ప్పలు అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా మ త్స్యశాఖ అధికారి భాస్కర్ నాయక్ తెలిపారు. పెన్‌గంగా వద్ద ప్రత్యేక క్రేన్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు.