
దిగుబడిపై దిగాలు
ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న పత్తి చేనులో రాలిపోయిన పూత, కాత పెట్టుబడి డబ్బులూ రాని దుస్థితి పరిహారంతో సర్కార్ ఆదుకునేనా?
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ఆగస్టులో కురిసిన వర్షాలు పత్తి రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. పూర్తిగా పంట నష్టపోయిన పలువురు రైతులు దిగాలు చెందుతున్నారు. వ్యవసాయ శాఖ సర్వే నిర్వహించి నష్టం అంచనా వేసింది. ప్రభుత్వానికి నివేదిక పంపనుంది. దెబ్బతిన్న పంటలు కాస్తయినా మెరుగవుతాయని ఆశించిన రైతులు చేల వద్దకు వెళ్లి బావురమంటున్నారు. చేను అడుగుభాగంలో రాలిన పత్తి పిందెలను చూసి ఆవేదన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో.. రాదో.. అని మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం కనికరం చూపి పరిహారం మంజూరు చేసి ఆదుకుంటుందని ఆశిస్తున్నారు. ఇది జిల్లాలోని వర్షాలకు పంట దెబ్బతిన్న పత్తి రైతుల ప్రస్తుత దయనీయ స్థితి.
ఇవీ శాస్త్రవేత్తల సూచనలు
వర్షాలు తగ్గిన తర్వాత చేలలో నిలిచిన నీటిని బయటకు వెళ్లేలా కాలువలు తీయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎకరాకు కాపర్‌ఆక్సిక్లోరైడ్ (సీవోసీ) 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్కల అడుగు భాగంలో పిచికారీ చేయాలని చెబుతున్నా రు. 19:19:19 ఐదు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచిస్తున్నారు. 35కిలోల యూరియా, 10కిలోల పొటాష్ కలిపి చల్లాలని బాధిత రైతులకు వివరిస్తున్నారు.
వానాకాలంలో సాగు వివరాలు
సాగు విస్తీర్ణం 5.85లక్షల ఎకరాలు
పత్తి విస్తీర్ణం 4.40లక్షల ఎకరాలు