
క్రీడలపై దృష్టి సారించాలి
ఆదిలాబాద్: ప్రతి ఒక్కరూ క్రీడలపై దృష్టి సా రించాలని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జాతీ య క్రీడా దినోత్సవంను ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం నిర్వహించారు. మేజ ర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి కలెక్టర్ రాజర్షిషాతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడా రు. విద్యార్థులు బాల్యం నుంచే క్రీడలపై దృష్టి సారించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దే శంలో క్రీడాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు.ఇందులోభాగంగా సెప్టెంబర్ 21 నుంచి డిసెంబర్ 25వరకు సంసద్ ఖేల్ మహో త్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ పో టీలను విజయవంతం చేయాలని కోరారు. కా ర్యక్రమానికి సంబంధించి డిజిటల్ లాంచింగ్ చేపట్టారు. అనంతరం జాతీయస్థాయిలో ప్రతి భ కనబర్చిన క్రీడాపాఠశాల విద్యార్థులను స న్మానించారు. ఇందులో డీవైఎస్‌వో శ్రీనివాస్, పార్థసారథి, అధికారులు, క్రీడాకారులు తది తరులు పాల్గొన్నారు.