
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
కై లాస్‌నగర్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవా రం ఆందోళన చేపట్టారు. తెలంగాణ యూ నైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూని యన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. ఆధార్ బెస్డ్ అటెండెన్స్ రద్దు చేయాలని, కనీస వేతనం చెల్లించాలని డి మాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడి న వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి అందజేశారు. ఇందులో సంఘ బాధ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.