
ఓట్ల మార్పిడి కేసులో కొత్త మలుపు
ఇప్పటికే అరెస్టయిన ఆర్‌ఐ హుస్సేన్
ఎఫ్‌ఐఆర్‌లో ఏ–6గా తహసీల్దార్..
రెండు రోజులుగా అజ్ఞాతంలో సత్యనారాయణరావు
అదిరే.. సెట్టింగ్‌లు
ఇచ్చోడ: ఓట్ల మార్పిడి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. కేసులో సంబంధం ఉన్న ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులతో పాటు స్థానిక ఆర్‌ఐ హుస్సే న్‌ను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన విషయం విదితమే. ఈ క్ర మంలో శుక్రవారం కేసు మరో మలుపు తిరిగింది. ఎఫ్‌ఐఆర్‌లో తహసీల్దార్ సత్యనారాయణరావును ఏ–6 గా చేర్చిన విషయం వెలుగులోకి వచ్చింది. కేసులో తీగ లాగితే డొంక కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. కాగా, గురువారం నుంచి తహసీల్దార్ సత్యనారాయణరావు అజ్ఞాతంలోకి వెళ్ల డం రెవెన్యూ వర్గాలో చర్చనీయాంశంగా మారింది.
కేసు తీరుతెన్నులు..
మండలంలోని అడేగామ(బి) మాజీ సర్పంచ్ కదం వనిత, ఆమె భర్త కదం సుభాష్ ఓట్లు గ్రా మంలోని 140 పోలింగ్ బూత్‌లో ఉన్నాయి. అయితే వారి ప్రమేయం లేకుండా కొందరు నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాలతో ఫోర్టరీ చేసి, రెవె న్యూ సిబ్బంది సహకారంతో ఇచ్చోడలోని 137వ పోలింగ్ బూత్‌కు మార్చారు. ఈ విషయంపై సుభాష్ ఈనెల 20న కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్ విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ సత్యనారాయణరావును ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో అప్రమత్తమైన తహసీల్దార్ ఈ నెల 21న తిరిగి వారి పేర్లను తన లాగిన్ ద్వారా 140వ పోలింగ్ బూత్‌కు మార్చారు. విషయం బయటకు పొక్కడం, కలెక్టర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈనెల 25న తహసీల్దార్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫో ర్జరీ పత్రాలతో ఓట్ల మార్పిడి కోసం గోస్కుల నితిన్, కదం విశాల్ దరఖాస్తు చేశారని వారిపై చట్టా రీత్యా చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆర్‌ఐ హుస్సేన్ ఏ–5గా చేర్చి బుధవారం అరెస్ట్ చేశారు. అదే రోజు ఏ–6గా తహసీల్దార్ సత్యనారాయణరావును కూడా చేర్చా రు. అయితే తహసీల్దార్ పేరును మాత్రం పోలీసులు విలేకరుల సమావేశంలో ధ్రువీకరించలేదు. కాగా, గురువారం నుంచి తహసీల్దార్ అజ్ఞాతంలోకి వెళ్లారు. కేసు రోజుకో మలుపు తిరుగుతుండంతో రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మా రింది. ఈ విషయమై ‘సాక్షి’ ఆదిలాబాద్ ఆర్డీవో స్రవంతిని వివరణ కోరగా.. తహసీల్దార్ సెలవులో ఉన్నట్లుగా తనకు సమచారం లేదని పేర్కొన్నారు. అలాగే తహసీల్దార్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన విషయం కూడా తన దృష్టికి రాలేదని పేర్కొనడం గమనార్హం.

ఓట్ల మార్పిడి కేసులో కొత్త మలుపు