
బదిలీలకు వేళాయె
కై లాస్‌నగర్: జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న క్లస్టర్ కోఆర్డినేటర్(సీసీ)లకు బదిలీలు జరుగనున్నాయి. దీర్ఘకా లంగా ఒకే చోట పనిచేస్తున్న వారికి స్థానచలనం కల్పించాలని ఆదేశిస్తూ ఆ సంస్థ సీఈవో దివ్యదేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ప్‌లో ఎల్–1, ఎల్–2 కేటగిరీ ఉద్యోగులుగా పరిగణించే వారి బది లీల కోసం గత నెలలో ఆప్షన్లను స్వీకరించారు. జి ల్లాలో పనిచేస్తున్న 120 మంది ఆప్షన్లు ఇచ్చారు. అలాగే స్పౌజ్‌గ్రౌండ్, అనారోగ్యం, వైకల్యం, తల్లి దండ్రులు, చిన్నారుల ఆరోగ్యం వంటి అంశాలను కూడా అందులో పొందుపరిచారు. వివరాలను పరి శీలించిన సెర్ప్ అధికారులు బదిలీకి అర్హులైన వారి జాబితా సిద్ధం చేసి జిల్లాకు పంపించారు. వారికి శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన కౌన్సెలింగ్ ఉంటుందని డీఆర్డీవో రాథోడ్ రవీందర్ ప్రకటనలో తెలిపారు. అయితే వీరిని సొంత, పనిచేసే క్లస్టర్లు కాకుండా మండలంలోని ఇతర క్లస్టర్లకు బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో మూడు నుంచి ఐదు స్వయం సహాయక సంఘాలు ఉంటాయి.
11 మందికి మినహాయింపు ..
జిల్లా సెర్ప్ పరిధిలో సీసీలు, మాస్టర్ బుక్ కీపర్లు, పారాలీగల్ మండల సమాఖ్య పరిధిలోని సీసీలంతా కలిపి 109 మంది పని చేస్తున్నారు. ఇకస్వయం సహాయక సంఘాల నిర్వహణకు సంబంధించి ఆడిట్ ప్రక్రియ చేపట్టేందుకు ముగ్గురు సీబీవోలు, కమ్యూనిటీ సూపర్‌వైజర్స్ 8మంది కలిపి 11మంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయ కేంద్రంగా విధులు నిర్వహిస్తుంటారు. అయితే వీరికి మా త్రం బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నా రు. మండలస్థాయిలో పనిచేస్తున్న 109 మంది సీసీ లకు మాత్రమే కౌన్సెలింగ్ ద్వారా వారు ఎంచుకు న్న క్లస్టర్‌కు బదిలీ చేయనున్నారు. వీరికి నాలుగేళ్లకోసారి ఈ ప్రక్రియ నిర్వహిస్తుండగా చివరి సారిగా 2018లో చేపట్టారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తొలిసారిగా కానున్నాయి.