
మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి
సిరికొండ: స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మ ర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని పోలీస్‌స్టేషన్‌ను ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్‌తో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఆయా గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు మెరుగు పర్చుకోవాలన్నారు. ఆయన వెంట ఇచ్చోడ సీఐ రాజు, ఎస్సై పూజ, సిబ్బంది ఉన్నారు.
సిబ్బందిని అభినందించిన ఎస్పీ
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ మండలం ఎంకా గ్రామానికి చెందిన ఇప్పరి ప్రహ్లాద్– శకుంతల దంపతులు గురువారం పొలం పనులకు వెళ్లారు. భారీ వర్షం కారణంగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉట్నూర్ ఎస్సై ప్రవీణ్, ఏఎస్సై రామయ్య, కానిస్టేబుళ్లు అశోక్, రమేష్, జ్ఞానేశ్వర్, జిల్లా ఫైర్ అధికారుల సహకారంతో వారిని ఒడ్డుకు చేర్చారు. సిబ్బంది కృషిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.