
● పలుశాఖల అధికారుల తీరుపై ఎంపీ, ఎమ్మెల్యేల ఆగ్రహం ● పార
కై లాస్‌నగర్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన జిల్లాస్థాయి అభివృద్ధి, సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమీక్షా సమావేశం శుక్రవారం వాడీవేడిగా సాగింది. ఎంపీ గోడం నగేశ్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో విద్య, వైద్యం, ఐసీడీఎస్, ఇరిగేషన్, గిరిజన సంక్షేమం, మైనింగ్, హర్టికల్చర్, డీఆర్డీఏ, సివిల్ సప్‌లై, హౌసింగ్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, గిరిజన సంక్షేమం, ఇంజినీరింగ్ విభా గం, విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయం వంటి 40 శాఖలపై ఎంపీ సుదర్ఘీంగా సమీక్షించారు. ఆయా శాఖలకు మంజూరైన నిధులు, చేపట్టిన పనుల ప్రగతిపై ఆరా తీశారు. పలు శాఖల అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అవసరమైన ప్రతిపాదనలు అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎస్‌సీ డీఎం రాహుల్‌కు అవార్డు రావడంపై అభినందించిన ఎంపీ అధికారులతో చప్పట్లు కొట్టించారు. సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమాచారం ఇవ్వరా.. తమాషా చేస్తున్నారా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ నాయకులు భూమిపూజ చేయడంపై బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ తమకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని పీడీ బసవేశ్వర్‌ను ప్రశ్నించారు. ఇలా భూమిపూజ జరిగిన ఇళ్లను రద్దు చేయించమంటరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క హౌసింగ్‌లోనే ఇలా జరుగుతుందని మందలిస్తూ దీనిపై కఠినంగా ఆదేశాలివ్వాలని కలెక్టర్‌కు సూచించారు. నేషనల్ హైవే శాఖపై ఎమ్మెల్యే మాట్లాడుతూ టోల్ ట్యాక్స్ వసూలు చేయడమే తప్ప రోడ్లపై సౌకర్యాలు కల్పించరా అంటూ పీడీని ప్రశ్నించారు. సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో మూగజీవాలు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎలాంటి వసతులున్నాయి, ఇక్కడే ఎందు కు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా అంటే అలసత్వమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్‌లో ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు పడుతారు.. : ఎంపీ నగేశ్
‘అనిల్‌జాదవ్ నేను ప్రచారంలో తిరిగి గెలిపించుకున్న ఎమ్మెల్యే.. ఇందిరమ్మ భూమి పూజ లో ఎక్కడా కనిపించడం లేదు. అలాగే ఆది లాబాద్‌లో పాయల్ శంకర్ కూడా కనిపిస్తలే డు. పార్లమెంట్‌లో మీపై ఫిర్యాదు చేస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఎంపీ నగేశ్ హౌసింగ్ పీడీని హెచ్చరించారు. కలెక్టర్ క ల్పించుకుని రాజకీయ జోక్యంలేకుండా జిల్లా ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళుతానని తెలి పారు. పంచాయతీరాజ్ రోడ్లకు సైతం ఇలాగే కొబ్బరికాయలు కొడుతున్నారని పరో క్షంగా అధికారపార్టీ నాయకుల తీరును తప్పుపట్టారు. పొలంబాట రోడ్లపై సమీక్షించిన ఎంపీ జిల్లాలో 610 కిలోమీటర్లు మంజూ రు చేస్తే తనను కేవలం 25 కిలోమీటర్లకే ప్రతి పాదనలు అడిగారని పీఆర్ ఈఈ రాథోడ్ శివరాంను ప్రశ్నించారు. దీనిపై ఈఈ ఇస్తాను సార్.. అని సమాధానమివ్వగా నేను బిచ్చమడుకో వాల్నా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను డిగ్రేడ్ చేశారని పార్లమెంట్‌లో ప్రివి లేజ్ మోషన్ మూవ్ చేస్తే మీమ్మల్నెవరూ కా పాడలేరని ఘాటుగానే మందలించారు. కేజీ బీవీలు, ఆశ్రమపాఠశాలలకు ప్రహరీలు ఇవ్వ రు.. సీసీ రోడ్లు ఇవ్వరు ఇంతేనా అని ప్ర శ్నించగా.. అంతే సార్ అని ఈఈ సమాధానమి వ్వడంతో మరింత ఆగ్రహానికి గురయ్యా రు. కామన్‌సెన్స్ లేదా మాట్లాడే విధానం తెలియదా అంటూ ఫైర్‌అయ్యారు. విద్యాశాఖ అధి కారులు సరైన వివరాలతో రాకపోవడంపై వారిని మందలించారు. పెన్‌గంగ నుంచి ఇ సుక అక్రమంగా తరలిస్తూ రూ.కోట్లు సంపాదిస్తుంటే ఏం చేస్తున్నారని మైనింగ్ ఏడీ రవీందర్‌ను ప్రశ్నించారు. పెద్ద వాగు నుంచి ఇసుక తీసుకొచ్చి అక్రమంగా విక్రయాలు సా గిస్తుంటే ఎందుకు కట్టడిచేయడం లేదని దానిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

● పలుశాఖల అధికారుల తీరుపై ఎంపీ, ఎమ్మెల్యేల ఆగ్రహం ● పార

● పలుశాఖల అధికారుల తీరుపై ఎంపీ, ఎమ్మెల్యేల ఆగ్రహం ● పార