
పూర్వ విద్యార్థుల కార్యవర్గం ఎన్నిక
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల కార్యవర్గాన్ని శనివారం రాత్రి ఎన్నుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా పురాణం సతీశ్, ఉపాధ్యక్షుడిగా వసంత్‌రావు, ప్రధాన కార్యదర్శిగా అభయ్‌రాజ్, కార్యదర్శిగా గట్టయ్య, సంయుక్త కార్యదర్శిగా అన్వేష్‌రావు, కోశాధికారులుగా సరోజ, ఉమా శంకర్, సభ్యులుగా శ్రీనివాస్, దేవిదాస్, దశరథ్, సతీశ్‌రెడ్డి, విక్రమ్, హరీశ్, బాబు, రంజిత్, సల్ల విజయ్‌బాబు, సలహాదారులుగా రఘునందన్, వీవీఎన్‌ఎస్ రామ్, రమేశ్‌ను ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.