
కేజీబీవీల్లో సీఆర్టీ పోస్టుల భర్తీ
ఆదిలాబాద్‌టౌన్: కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ పోస్టులను భర్తీ చేశారు. ఇటీవల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టిన విద్యాశాఖ అధికారులు శుక్రవారం డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి వారికి నియామక పత్రాలు అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని సూచించారు. జిల్లాలో ఐదు పోస్టులు ఖాళీగా ఉండగా, నాలుగు భర్తీ చేసినట్లు తెలిపారు. మావల కేజీబీవీలో ఫిజికల్ సైన్స్, ఉట్నూర్‌లో బయోసైన్స్, ఇచ్చోడలో పీజీ సీఆ ర్టీ నర్సింగ్, బేలలో పీజీ సీఆర్టీ బాటనీ పోస్టులు భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. సీఆర్టీ పీఈటీ పోస్టింగ్‌కు సంబంధించి అభ్యర్థి నాట్ విల్లింగ్ ఇచ్చారని, దీంతో ఆ పోస్టును భర్తీ చేయలేదని వివరించారు. గత నియామకాల్లో ఒకరికి బదులు మరొకరికి పోస్టింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫిజికల్ సైన్స్‌కు సంబంధించి 8వ ర్యాంక్ అభ్యర్థిని తొలగించి 7వ ర్యాంక్ అభ్యర్థికి పోస్టింగ్ కల్పించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నా రు. కార్యక్రమంలో ఆదిలాబాద్ అర్బన్ విద్యాధికారి సోమయ్య, డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ వేణు, కేజీబీవీ సెక్టోరియల్ అధి కారి ఉదయ్‌శ్రీ, రమేశ్ పాల్గొన్నారు.