
ఒత్తిడిని అధిగమించాలి
ఆదిలాబాద్‌టౌన్: కోర్టులో విధులు నిర్వహించే జడ్జీలు, న్యాయవాదులు ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగాలని జిల్లా జడ్జి కె.ప్రభాకరరా వు అన్నారు. ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయ శ్రేయ దినో త్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంత రం మాట్లాడారు. కోర్టులో జడ్జీలు, న్యాయవా దులు ఒత్తిడితో ఉంటారని, పరస్పర సహకా రంతో కక్షిదారులకు ఉన్నతమైన న్యాయం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి శివరాంప్రసాద్, ఫ్యామిలీ కోర్టు జడ్జి లక్ష్మికుమారి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి వివేక్, సీని యర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి, జూనియర్ సివిల్ జడ్జి హుస్సేన్ నాయక్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్రాల నగేశ్, డీఎస్పీ శర్మ, న్యాయవాదులు పాల్గొన్నారు.