
ఆదిలాబాద్ జిల్లా జట్టు
ఆదిలాబాద్: నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన 11వ రాష్ట్ర స్థాయి జూనియర్ షూటింగ్ బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆది లాబాద్ జట్టు సూర్యాపేట బాలికల జట్టుపై రెండు పాయింట్ల తేడాతో తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. జట్టులో వైష్ణవి, సింధు రాజారాణి అత్యుత్తమంగా రాణించారని షూటింగ్ బాల్ సంఘం జిల్లా కార్యదర్శి హరిచరణ్ పేర్కొన్నారు. వారి వెంట కో చ్, మేనేజర్లు అజయ్, జ్యోతి ఉన్నారు. జట్టు ద్వితీ య స్థానంలో నిలువడంపై జిల్లా షూటింగ్ బాల్ సంఘం అధ్యక్షుడు సాయిని రవికుమార్, డీవైఎస్‌ఓ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి తదితరులు అభినందించారు.