పురుగుల మందుతాగి ఒకరి ఆత్మహత్య
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని చాందా(టి) గ్రామానికి చెందిన జంగం సంతోష్(37) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. సంతోష్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన ఇంట్లో ఎవరు లేని సమయంలో నవంబర్ 29న పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య మహేశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ
మంచిర్యాలటౌన్: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి పట్టణ వీధుల్లో శుక్రవారం సాయంత్రం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ ఎలా సోకుతుంది, నివారణ కోసం చేపట్టాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ, వ్యాధి సోకిన వారికి అందిస్తున్న చికిత్స వివరించారు.