సచ్చిదానంద ఆశ్రమంలో రజనీకాంత్
ఒకవైపు దేశం ’కబాలి’ మానియాలో మునిగిపోయి.. అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం తన సహజ ఆధ్యాత్మిక ధోరణిలో అమెరికాలోని సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన వెంట కూతురు సౌందర్యా ధనుష్ కూడా ఉన్నారు.
1980లో వర్జీనియాలో ఏర్పాటైన సచ్చిదానంద ఆశ్రమాన్ని యోగావిల్లే అని కూడా పిలుస్తారు. యోగిరాజ్ శ్రీ స్వామి సచ్చిదానంద ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. 1969లో వూడ్స్టాక్ ఫెస్టివల్ లో ప్రారంభ ఉపన్యాసం చేసిన సచ్చిదానంద పాశ్చాత్యులకు ఆధ్యాత్మికవేత్తగా సుప్రసిద్ధులు. 65 ఏళ్ల రజనీకాంత్ దాదాపు నెలకిందట అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అక్కడ కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శుక్రవారం కబాలి సినిమా విడుదల అవుతుండటంతో రజనీ తిరిగి ఇండియా వచ్చారు.
అమెరికా పర్యటనలో తన ఆధ్యాత్మిక గురువు సచ్చిదానందకు చెందిన ‘లోటస్ ఆల్ ఫెయిత్స్ టెంపుల్’ను రజనీ సందర్శించారని ఆయన కూతురు సౌందర్య ట్విట్టర్లో తెలిపారు.