breaking news
World Mental Health Day
-
మనసు మాట విందాం!
మన సమాజంలో దగ్గు, జలుబు, జ్వరం, షుగర్, బీపీ అంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. కానీ డిప్రెషన్, ఆందోళన, పానిక్ అటాక్, డీ–పర్సనలైజేషన్ లాంటి వాటిని బలహీనతలు లేదా అలసత్వంగా చూస్తారు. అవేవో బాధితులు కావాలని తెచ్చిపెట్టుకున్నట్టు భావిస్తారు. కానీ నిజానికి మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానమే. ఇవి రెండూ పరస్పర ఆధారితాలు. తలనొప్పి, తల తిరుగుడు, వాంతులు, జీర్ణ సంబంధ ఇబ్బందులు, గుండె అత్యంత వేగంగా కొట్టుకోవడం, ముఖ కండరాలు అదరడం, చర్మం పాలిపోవడం లాంటి శారీరక లక్షణాల ద్వారా మానసిక వ్యాధులు వ్యక్తం అవుతాయి. అంటే, మనసు తాను అనుభవించే హింసను గుర్తించమని, త్వరగా ఈ బాధను తగ్గించే ఉపాయం చూడమని శరీరం ద్వారా వేడుకుంటుంది! కానీ పట్టించుకోం మనం. ఎందుకంటే, బాధితులు ఆ వ్యాధులకు సంబంధించిన మందులు తీసుకుంటే వాటికి బానిసలవుతారని, ఈ వ్యాధులు పూర్తిగా నయం కావనీ. నిజానికి ఇవన్నీ తప్పుడు భావనలు. మానసిక వ్యాధులు కూడా శారీరక వ్యాధుల్లానే అనేక కారణాల వల్ల రావచ్చు. మెదడు రసాయనాల అసమతుల్యత, వంశపారంపర్యం, ఒత్తిడి, పరిసరాలు వంటి అంశాలు దీనికి కారణం అవుతాయి. కనుగొనదగిన కారణాలు ఏమీ లేకుండా కూడా మానసిక వ్యాధులు రావచ్చు. తొలిదశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స చేస్తే, బాధితులు సాధారణ జీవితం గడపవచ్చు. పిల్లలు, యువకులు, పెద్దలు ఎవరికి అయినా మానసిక సమస్యలు రావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, 2021లో ప్రపంచంలో సుమారు 1.1 బిలియన్ మంది మానసిక వ్యాధుల బారినపడ్డారు (ప్రతి ఎనిమిది మందిలో ఒకరు) అసలు మీరు పని చేసేచోట, సంచరించే చోట మీకు తెలియకుండా ఇప్పటికే ఒకరిద్దరు డిప్రెషన్ తోనో, ఏంగ్జయిటీతోనో వుండి ఉండొచ్చు. రోజువారీ జీవితంలో అవరోధం కలగనంతవరకూ పరవాలేదు. సమస్య వస్తే మాత్రం, దాచుకోవడం కంటే కుటుంబ సభ్యుల, స్నేహితుల, సహకారం తీసుకోవడం, వైద్యుని సంప్రదించడం ఎంతో అవసరం. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి, మానసిక ఆరోగ్య సమస్యలు ‘‘నిజమైనవి’’ అనే విషయాన్ని గ్రహించడం, అంగీకరించడం. జ్వరం వస్తే విశ్రాంతి తీసుకుంటాం కదా! అలాగే, మనసు అలసిపోయినప్పుడు, అది బాధపడినప్పుడు కూడా సహాయం కోరడం సిగ్గుపడాల్సిన విషయం కాదు. ధైర్యం, అవగాహన అవసరమయ్యే విషయం. మనసుని ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలు పెట్టుకోవాలి. గ్రౌండింగ్ టెక్నిక్స్, బ్రీతింగ్ వ్యాయామాలు నేర్చుకోవాలి.. సర్వమానవ సహోదరత్వం, సౌభ్రాతృత్వం గురించి ఉపన్యాసాలు దంచేస్తాం. మనలో అది నిజంగా వుందని నిరూపించుకునే చిన్న అవకాశం ఒకటి ఏమిటంటే, మానసిక వ్యాధులతో బాధపడేవారిని చూసి ఎగతాళిగా నవ్వకుండా, తప్పుగా మాట్లాడకుండా ఉండటం, వాళ్లకి చేతనైన సహాయం చెయ్యడం. ఆమాత్రం చేయలేమా?ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల్లో అబ్రహాం లింకన్, ఐజాక్ న్యూటన్, విన్సెంట్ వ్యాన్గో, చార్లెస్ డికెన్స్ నుంచీ మన దీపికా పదుకొనే వరకూ ఎందరో గొప్ప వ్యక్తులు, సెలబ్రిటీలు మానసిక వ్యాధులతో పోరాడి, సాధారణ స్థాయిని మించి ఉన్నతంగా బతకడమే కాకుండా, తమ ప్రతిభతో లోకానికి ప్రేరణగా నిలిచారు. మానసిక రోగులు చాలావరకు ప్రమాదకారులు కాదు; మందులు వైద్యుని సూచన మేరకు తీసుకుంటే అడిక్షన్ రాదు.వైష్ణవి గద్దె, వైద్య విద్యార్థిని -
మానసిక ఆరోగ్యానికి మనమేం చేస్తున్నాం?
ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10న ‘మానసిక ఆరోగ్య దినోత్సవా’న్ని (World Mental Health Day 2025) జరుపు కొంటున్నాము. మానసిక ఆరోగ్య ప్రాము ఖ్యాన్ని గుర్తించి ‘వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్’ (డబ్ల్యూఎఫ్ఎమ్హెచ్) 1992 నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశా లలో మానసిక ఆరోగ్యంపై అపోహలు తొలగించి అవగాహన పెంచడానికి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘విపత్తులు, ఆపత్కాలంలో మానసిక ఆరోగ్య సేవల లభ్యత’ అనేది ఈ ఏడాది నినాదం. ‘శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా, సామాజికంగా కూడా దృఢంగా ఉండటం’ సంపూర్ణ ఆరోగ్యం అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వచనం. మనిషి తన ఆలోచనలు, భావోద్వేగాలు నియంత్రించుకోగలిగి, సమస్యలను ధైర్యంగా ఎదు ర్కొని, సరైన నిర్ణయాలు తీసుకోగలగాలి. డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 97 కోట్లకు పైగా ప్రజలు, రకరకాల మానసిక రుగ్మతలతో బాధ పడుతున్నారు. మన దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక ఇబ్బందికి గురవుతున్న వారే! డిప్రెషన్, ఆందోళన, మద్యపానం, మాదక ద్రవ్యాల విని యోగం వల్ల ఎక్కువమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, తొక్కిసలాటల్లో వందలాది మరణాలు సంభవించడం, కోవిడ్ లాంటి సందర్భాలలో అచటి ప్రజలు మరింత మానసిక క్షోభకు గురవుతారని పరి శోధనల్లో తేలిన విషయం. కోవిడ్ ప్రపంచానికి ఒక పెద్దపాఠం నేర్పింది. చావు భయంతోపాటు, లాక్డౌన్ ప్రభావం, ఉద్యోగాలు పోయి ఆర్థిక ఇబ్బందులు, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఒంటరిగా ఉండటం లాంటివన్నీ మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపాయి. ఒక అంచనా ప్రకారం, కోవిడ్‌లో మానసిక రుగ్మతలు కనీసం 25 శాతం పెరిగాయి. యువతలో మొబైల్ అడిక్షన్, డిప్రెషన్, గ్యాంబ్లింగ్ సమస్యలు అధికమయ్యాయి. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్–గాజా యుద్ధాల వల్ల అక్కడి ప్రజలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సర్వేలు తెల్పు తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ వంటి చోట్ల ఆ మధ్య సంభవించిన మేఘ విస్ఫోటనం వల్ల వచ్చిన వరదలు, ఆస్తి, ప్రాణనష్టంతో అనేకమంది మానసిక వేదనకు గురయ్యారు. దాదాపు 140 కోట్లకు పైగా జనాభా గల మన దేశంలో కనీసం 20 వేల మంది అర్హులైన మానసిక వైద్య నిపుణులు కూడా లేరంటే ఆశ్చర్యమే! మానసిక ఆరోగ్యానికి హెల్త్ బడ్జెట్లో కేటాయింపులు కేవలం ఒక శాతం కన్నా తక్కువే!చదవండి: Mounjaro వెయిట్‌లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు!ఈ సమస్యల నుండి బయటపడాలంటే, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థతో, మానసిక ఆరోగ్య సేవలను అనుసంధానించాలి. కళాశా లల్లో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు తప్పనిసరి చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెంటల్ హెల్త్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. విపత్తులలో పనిచేసే సిబ్బందికి ‘సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్’లో శిక్షణ ఇప్పించాలి. హెల్ప్లైన్లు, టెలిమానస్ లాంటి సర్వీసులు మరింతగా పెంచాలి. ఆపద సమయాల్లో మన మిచ్చే ఓదార్పు, భరోసా, భవిష్యత్తులో వారు మరిన్ని మానసిక రుగ్మతలకు లోనుకాకుండా నివారిస్తుంది. మానసిక వైద్యుల కొరత ఉన్న మన దేశంలో, ఇలాంటివి ఎదుర్కొనేందుకు ఆశా, హెల్త్ వర్కర్లు; ఎన్ఎస్ఎస్, రెడ్‌క్రాస్ కార్యకర్తలు; టీచర్లు, మత ప్రతి నిధులు లాంటి వారికి, ‘సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్’లో తగిన శిక్షణ నివ్వాలి. అప్పుడే 2047 నాటికి మనం పరిపూర్ణ ‘వికసిత్ భారత్’ని సాధించగలుగుతాం. ఇదీ చదవండి: చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!వ్యాసకర్త డా.ఇండ్లరామసుబ్బా రెడ్డి మానసిక వైద్య నిపుణులు(అక్టోబర్ 11 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
తరం తడబాటు
ఈ లెక్కలన్నీ ఏం చెప్తున్నాయి?. యువత, విద్యార్థుల మానసిక ఆరోగ్యం ప్రజా సమస్యగా మారుతోందని. ఇవి ఏవో కాకి లెక్కలు కాదు, ప్రతిష్ఠాత్మక జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైన విస్తుగొల్పే వాస్తవాలు. విద్యాపరమైన ఒత్తిడి, తల్లిదండ్రుల ఆశలు, అధిక పోటీతో కూడిన విద్యా వ్యవస్థ విద్యార్థుల్లో ఆందోళన, నిస్ప ృహ, ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ సంక్షోభం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది, ముఖ్యంగా యువతలో ఆత్మహత్యల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.విద్యార్థుల మానసిక ఆరోగ్య సంక్షోభంపై గణాంకాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం భారతదేశంలో ఆత్మహత్యల రేటు విద్యార్థుల్లో స్థిరంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2022 సంవత్సరంలో 13,000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, అంటే ప్రతిరోజూ సగటున 35 మంది విద్యార్థులు ప్రాణాలను తీసుకున్నారు. 2022లో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యలలో విద్యార్థుల ఆత్మహత్యలు 7.6%. గత పదేళ్లలో (2013–2022) విద్యార్థుల ఆత్మహత్యలు 64% పెరిగాయి. ఈ సంఖ్య 6,654 నుండి 13,044కు చేరింది. భారతదేశంలోని 30 విశ్వవిద్యాలయాలలో 2024లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతి పదిమంది విద్యార్థులలో ఒకరికి గత సంవత్సరంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయి. వీరిలో మూడింట ఒక వంతు మంది ఆత్మహత్యకు ప్రయత్నించారు.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం పరీక్షల్లో వైఫల్యం ఆత్మహత్యలకు ఒక కారణం. రాజస్థాన్‌లోని కోటా సహా కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి పొందిన నగరాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.పాఠశాల పిల్లల్లో కూడా.. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలోని 23% మంది పాఠశాల విద్యార్థులు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్’, సీబీఎస్ఈ సంస్థలు పాఠశాలల్లో నిర్వహించిన ఒక సర్వేలో 13–17 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులలో 81% మందికి పరీక్షల ఒత్తిడి ప్రధాన సమస్యగా ఉందని వెల్లడైంది. యూనిసెఫ్ 2021 నివేదిక ప్రకారం, భారతదేశంలో 15–24 సంవత్సరాల వయస్సు గల యువతలో 14% మంది తరచుగా ఆందోళన లేదా డిప్రెషన్ వంటి వాటితో బాధపడుతున్నారు.విద్యార్థుల్లో మానసిక అనారోగ్య లక్షణాలు ఇలా ఉంటాయి. వీటిలో కొన్ని దీర్ఘ కాలం కనిపిస్తే వారిలో మానసిక సమస్య ఉందని అంచనా వేయవచ్చు. నిపుణుల సాయం తీసుకునేలా ప్రోత్సహించవచ్చు. భావోద్వేగ ప్రవర్తన మార్పులునిరంతర విచారం, నిస్సహాయత భావన. ఎక్కువగా చిరాకు పడడం, కోపం లేదా మూడ్ స్వింగ్స్. · ఒకప్పుడు ఆనందించిన కార్యకలాపాల పట్ల ఆసక్తి కోల్పోవడం. · స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండడం. ·సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం. · విపరీతమైన భయం, ఆందోళన లేదా ఆందోళనతో కూడిన దాడులు.మానసిక, శారీరక లక్షణాలునిద్ర, ఆకలిలో మార్పులు (ఎక్కువ నిద్ర పోవడం లేదా నిద్రలేమి, తక్కువ లేదా ఎక్కువ తినడం). ·ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సమస్యలు.గతంలో సులభంగా చేసిన పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది.·తీవ్రమైన తలనొప్పి లేదా కడుపు నొప్పులు వంటి వివరించలేని శారీరక నొప్పులు. ఆత్మ గౌరవం కోల్పోవడం లేదా నిస్సహాయత భావన. ·ఆత్మహత్య ఆలోచనలు లేదా మరణం గురించి ఆలోచించడం.అకడమిక్, ప్రొఫెషనల్ లక్షణాలుచదువులో గణనీయమైన క్షీణత.పాఠశాల పని పట్ల ఆసక్తి తగ్గడం.తరగతులకు హాజరు కాకపోవడం.పాఠశాల పనితీరులో ఆకస్మిక మార్పులు.అవగాహన అంతంత మాత్రమే! ఓ పక్కన మానసిక ఆరోగ్య సమస్యలు యువతను కారుమబ్బుల్లా కమ్మి వేస్తుంటే, మానసిక ఆరోగ్య సేవలపై అవగాహన రాహిత్యం కనిపిస్తోంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నిర్వహించిన 2023 సర్వే ప్రకారం, దాదాపు 70 శాతం మంది విద్యార్థులు మానసిక ఆరోగ్య సహాయం కోరితే తోటివారి నుండి ప్రతికూలతను ఎదుర్కొంటారని భయపడుతున్నారు.‘ది జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ హెల్త్’ నివేదిక ప్రకారం, కేవలం 50 శాతం మంది విద్యార్థులకు మాత్రమే తమ క్యాంపస్‌లో కౌన్సెలింగ్ సేవలు ఉన్నట్లు తెలుసు. ఇది కౌన్సెలింగ్ సేవల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరానికి నిదర్శనంగా నిలుస్తోంది.అసలు శత్రువు అదే! యువత, విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెచ్చరిల్లడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ సోషల్ మీడియా వ్యసనం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ’ నిర్వహించిన సర్వే ప్రకారం యువతలో 70 శాతం రోజుకు మూడు నుంచి నాలుగు గంటలకు మించి ఫోన్ వాడుతున్నారు. అందులో ఎక్కువగా సోషల్ మీడియాను చూస్తున్నారు. దీనితో ప్రతి ఐదుగురులో ఒకరు డిప్రెషన్ లేదా ఆందోళన బారిన పడుతున్నారు. వ్యసనంగా ఇలా.. మొబైల్ ఫోన్ల వాడకం పెరగడంతో సోషల్ మీడియా వ్యసనం తీవ్రమైన సమస్యగా మారుతోంది. ఈ వ్యసనం కేవలం ఒక అలవాటు కాదు, ఇది మెదడు పనితీరును మార్చే ఒక న్యూరోసై¯Œ ్స ప్రక్రియ. సోషల్ మీడియా వ్యసనానికి ప్రధాన కారణం మన మెదడులోని డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్. డోపమైన్ ఆనందం, సంతృప్తి, ప్రోత్సాహంతో ముడిపడి ఉన్న ఒక రసాయనం. మనం ఏదైనా సంతోషకరమైన పని చేసినప్పుడు, ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు లేదా ప్రశంసలు పొందినప్పుడు, మెదడులోని రివార్డ్ సిస్టమ్ డోపమై¯Œ ను విడుదల చేస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి లైక్, కామెంట్, షేర్, కొత్త నోటిఫికేషన్ చిన్నపాటి రివార్డ్‌గా పనిచేస్తుంది. ఈ రివార్డ్‌లు డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తాయి. యువత మెదడు ఎక్కువ డోపమైన్ పొందడం కోసం నిరంతరం సోషల్ మీడియాను చెక్ చేసుకునేలా అలవాటు పడుతుంది. ఈ నిరంతర ప్రేరణతో మెదడులో డోపమైన్ రిసెప్టర్లు సున్నితత్వాన్ని కోల్పోతాయి, దాంతో మరింత ఎక్కువ డోపమైన్ కోసం మెదడు ఆరాటపడుతుంది. ఇదే వ్యసనానికి దారి తీస్తుంది.మానసిక ఆరోగ్యం మటాష్!సోషల్ మీడియా మన జీవితాల్లో అంతర్భాగంగా మారింది. యువతపై దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇది సమాచారాన్ని పంచుకోవడానికి, స్నేహితులతో కనెక్ట్ కావడానికి ఒక వేదికగా ఉన్నప్పటికీ, దాని ప్రతికూల ప్రభావాలు మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన సవాళ్లను సృష్టిస్తున్నాయి. వివిధ సర్వేలు, అధ్యయనాలు యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియజేస్తున్నాయి.ఒక సర్వే ప్రకారం, భారతదేశంలోని ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు సోషల్ మీడియాకు బానిసలు అవుతున్నారు. దాదాపు 46 కోట్ల మంది సోషల్ మీడియా వినియోగదారులు ఉన్న భారతదేశంలో ఇది ఒక ప్రధాన సమస్యగా మారింది.యువతలో 27% మంది సోషల్ మీడియాపై ఆధారపడే లక్షణాలను చూపిస్తున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. సోషల్ మీడియాను రోజుకు 3 గంటలకన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సోషల్ మీడియాలో ఇతరుల ‘పరిపూర్ణమైన‘ జీవితాలను చూసి తమను తాము పోల్చుకోవడంతో యువతలో ఆత్మన్యూనత భావన పెరుగుతోంది. ఇది అసూయ, అసంతృప్తి, ఒత్తిడికి కారణమవుతోంది. ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులు యువతలో తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తున్నాయి. వీటి వల్ల వారు నిస్పృహకు, ఆందోళనకు గురవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో చూసే అందమైన ఫోటోలు, వీడియోల వల్ల యువత ముఖ్యంగా మహిళలు, తమ శరీర రూపాన్ని గురించి ఆందోళన చెందుతున్నారు. భారత యువతుల్లో 36 శాతం మంది బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. ఇది బులీమియా, అనోరెక్సియా నెర్వోసా లాంటి ఈటింగ్ డిజార్డర్స్కు దారి తీస్తోంది.యువతలో 27% మంది సోషల్ మీడియాపై ఆధారపడే లక్షణాలను చూపిస్తున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. సోషల్ మీడియాను రోజుకు 3 గంటలకన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మెదడులో మార్పులుసోషల్ మీడియా వ్యసనం మెదడులోని వివిధ భాగాలపై ప్రభావం చూపుతుంది.ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగం నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచనా శక్తి, ప్రేరణ నియంత్రణ వంటి కీలకమైన విధులను నిర్వహిస్తుంది. సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటుపడిన వారిలో ఈ భాగం బలహీనపడుతుంది. దీనివల్ల వారు తమ ఫో¯Œ ను వాడటాన్ని నియంత్రించుకోలేరు, త్వరగా నిర్ణయాలు తీసుకోలేరు, ఏకాగ్రతను కోల్పోతారు.అమిగ్డాలా భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగం. సోషల్ మీడియాలో చూసే ప్రతికూల విషయాలు అమిగ్డాలాను నిరంతరం ప్రేరేపిస్తాయి. ఇది ఆందోళనకు, డిప్రెష¯Œ కు దారితీస్తుంది.హిప్పోకాంపస్ భాగం జ్ఞాపకశక్తికి, నేర్చుకోవడానికి సహాయపడుతుంది. సోషల్ మీడియాకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల హిప్పోకాంపస్ పనితీరు తగ్గుతుంది, ఇది చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.సుప్రీం కోర్టు దిశానిర్దేశంయువత మానసిక ఆరోగ్య సమస్యలకు సోషల్ మీడియాతో పాటు మారిన జీవనశైలి, సామాజిక పరిస్థితులు కూడా కారణం. దీనికి తోడు నిపుణుల కొరత, నిధుల కొరత కూడా వారికి సరైన వైద్య సేవలు అందకుండా చేస్తున్నాయి. దేశంలో మానసిక ఆరోగ్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ‘నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే’ ప్రకారం ప్రతి లక్ష జనాభాకు కేవలం సరాసరిన 0.7 శాతం మంది మానసిక వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. సైక్రియాట్రిస్ట్లు 0.75 శాతం, క్లినికల్ సైకాలజిస్టులు 0.07 శాతం వరకు అందుబాటులో ఉన్నారు. మన దేశంలో సైకాలజిస్టులకు ఇప్పటి వరకు చట్టపరమైన గుర్తింపు ప్రక్రియ లేకపోవడంతో వారికి సంబంధించిన లెక్కలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం లక్ష మందికి కనీసం ముగ్గురు ఉండాలి. ప్రపంచ సగటుతో పోలిస్తే మానసిక సేవలు మన దేశంలో చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సైకియాట్రీ, సైకాలజీ కోర్సులకు తగినంత ప్రోత్సాహం లేకపోవడం, శిక్షణ పొందిన నిపుణులు అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణం. ఆరోగ్య సంరక్షణలో మానసిక ఆరోగ్యానికి చాలా తక్కువ నిధులు కేటాయిస్తున్నారు. 2025 కేంద్ర బడ్జెట్లో మానసిక ఆరోగ్య సేవలకు కేవలం 1,004 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది మొత్తం ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్లో ఒక శాతం. ఇందులో కూడా 860 కోట్లు బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)కు, రూ. 80 కోట్లు ‘టెలిమానస్’కు కేటాయించడంతో మానసిక ఆరోగ్య సేవలు యువతకు చేరడం సాధ్యపడటం లేదు.నానాటికీ పెరిగిపోతున్న యువత, విద్యార్థుల ఆత్మహత్యలు, వారి మానసిక క్షేమంపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా సంస్థలు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించింది.ప్రతి వందమంది విద్యార్థులకు ఒక కౌన్సెలర్‌ను నియమించాలి. ఏడాదిలో రెండుసార్లు టీచర్స్‌కు, ఇతర సిబ్బందికి విద్యార్థుల మానసిక ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలి. విద్యా సంస్థల్లో సైకలాజికల్ కౌన్సెలింగ్ సేవలను అందుబాటు ఉంచాలి, ఆ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలి. విద్యార్థులపై అకడమిక్ విషయంలో ఎలాంటి లేబుల్స్ వేయకూడదు. విద్యేతర విషయాల్లో ప్రోత్సహించాలి. ర్యాగింగ్, లైంగిక వేధింపులు వంటి వాటిపై సత్వరమే స్పందించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. హెల్ప్ లైన్ నంబర్స్ అందరికీ కనిపించేటట్లు బోర్డులు ఏర్పాటు చేయాలి. పేరెంట్స్‌తో తరచుగా సమావేశాలు నిర్వహించి విద్యార్థుల్లో మానసిక అనారోగ్య లక్షణాలు గుర్తించే విధంగా అవగాహన కల్పించాలి. సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు విద్యార్థుల్లో, టీచర్స్‌లో మానసిక ఆరోగ్య సేవలపై ఉన్న అపోహలను పోగొట్టగలిగితే స్వామి వివేకానంద చెప్పినట్లుగా వజ్ర సంకల్పం, ఉక్కు నరాలు ఉన్న యువ భారతాన్ని చూడొచ్చు. రచయిత: జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, అడ్వాన్స్డ్ సైకలాజికల్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఏ ఇండియా) -
గట్టి కౌంటర్ ఇచ్చిన ఇరా ఖాన్
-
ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇరా ఖాన్
ముంబై : తన మీద వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ స్పందించారు. ఇటీవల ఇరా తన మానసిక ఆరోగ్యం గురించి ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గత నాలుగేళ్లుగా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ఈ వీడియోలో వెల్లడించారు. అయితే ఇరా చేసిన ఈ పోస్టుపై కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ద్వేషపూరిత వ్యాఖ్యలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. దీనిపై ఇరా స్పందిస్తూ ట్రోల్స్‌కు ఘాటుగా బదులిచ్చారు. తన పోస్టుపై ఎవరైన అభ్యంతరకంగా కామెంట్ పెడితే తొలగిస్తానని, అదే వ్యక్తి మళ్లీ మళ్లీ అలాగే పెట్టడానికి ధైర్యం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: ఇరా డిప్రెషన్‌కు ఆమె తల్లిదండ్రులే కారణం’ ఇక ఇరా ఖాన్.. ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాల కూతురు అన్న విషయం తెలిసిందే. తను(ఇరా) గత నాలుగేళ్లుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని పేర్కొన్నారు. అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. మానసిక ఆరోగ్యం కోసం ఏమైనా చేయాలని ఉంది. కానీ ఏం చేయాలో తెలీదు. అందుకే తన జర్నీ గురించి చెప్పాలి అనుకుటుంన్నానని, అసలు తనెందుకు ఒత్తిడికి లోనయ్యింది? ఏంటి అనే విషయాలను తెలియజేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దానివల్ల మీకు మానసిక ఆరోగ్యంపై కాస్తైనా అవగాహన వస్తుందేమో" అని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: హీరో కూతురు -
‘ఇరా డిప్రెషన్‌కు ఆమె తల్లిదండ్రులే కారణం’
ముంబై: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తాను మానసిక ఒత్తిడి, నిరాశకు గురయ్యానని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. అది చూసిన బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ ఇరా వీడియోకు స్పందిస్తూ.. తాను కూడా మానసిక అనారోగ్యంతో బాధపడినట్లు ట్విటర్లో షేర్ చేశారు. ‘నేను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు శారీరక దాడిని ఎదుర్కొన్నాను. నా సోదరిపై యాసిడ్ దాడి జరిగినప్పుడు నేను ఒంటరిగా తనని చూసుకున్నాను. అయితే నిరాశకు గురవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబానికి మాత్రం అది సాధారణ విషయం కాదు. సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యం’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ఇరా వీడియోపై కూడా స్పందిస్తూ ఆమె క్లినికల్ డిప్రెషన్‌కు కారణం తన తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడమే అని అభిప్రాయపడ్డారు. ఈ విషయం అందరికి తెలుసు కానీ దీనిని ఎవరూ ఏకిభవించరు అని పేర్కొన్నారు. (చదవండి: అన్నీ మారాయి... అవి తప్ప!) At 16 I was facing physical assault, was single handedly taking care of my sister who was burnt with acid and also facing media wrath, there can be many reasons for depression but it’s generally difficult for broken families children, traditional family system is very important. https://t.co/0paMh8gTsv — Kangana Ranaut (@KanganaTeam) October 12, 2020 ఇరా ఖాన్.. ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాల కూతురు. ఇరా ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేస్తూ.. “చాలా జరుగుతోంది, చెప్పడానికి చాలా ఉంది. అంతా గందరగోళంగా ఉంది. ఒత్తిడితో కూడుకున్నవి, చెప్పలేనివి, అసలు ఏంటో అర్థం కానీ విషయాలు ఇలా చాలా ఉన్నాయి. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ అవి ఏంటో కనీసం కొన్నింటినీ కనుక్కోగలిగాను. నాలుగేళ్లకు పైగా నేను నిరాశకు గురయ్యాను. కొన్ని రోజులు మానసిక ఒత్తిడికి వైద్యం కూడా చేయించుకున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. కానీ ఏడాదిగా ఈ మానసిక ఆరోగ్యానికి ఏదైనా చేయాలని ఉంది. కానీ ఏం చేయాలో.. ఏలా చేయాలో అర్థం కావడం లేదు’’ అంటూ ఇరా చెప్పకొచ్చారు. (చదవండి: నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: హీరో కూతురు) -
కరోనా: మానసిక ఆరోగ్యంలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: చీకటితో పాటే వెలుగు వస్తుంది.. కల్లోలం వెనుకే ప్రశాంతత ఉంటుంది.. కోవిడ్ అది నిరూపించింది. కొద్ది రోజుల క్రితం వరకు బెంబేలెత్తించిన మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దీంతో అన్ని రంగాలు తిరిగి గాడిన పడ్డాయి. ప్రజల మానసిక ఆరోగ్యంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. మానసిక ఆందోళన, కుంగుబాటు, ఆత్మహత్యాప్రవృత్తి వంటి కోవిడ్ వల్ల తలెత్తిన మానసిక రుగ్మతలు క్రమంగా తగ్గుతున్నట్లు మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహమ్మారి నియంత్రణ కోసం లాక్డౌన్ విధించడంతో ఒక్కసారిగా ప్రజాజీవనం అతలాకుతలమైంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు బ్రేక్ పడింది. కోవిడ్ బారిన పడిన వారిని ఒకరకమైన మానసిక భయాందోళనలు చుట్టుముట్టగా ఏ వైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందోననేఆందోళన సాధారణ జనాన్ని వెంటాడింది. ఇంటి నుంచి బయటకు వెళ్లినా, తిరిగి ఇళ్లు చేరుకొన్నా తమతో పాటే కోవిడ్ వచ్చిందేమోననే భయాందోళనకు గురయ్యారు. కానీ లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పాటు అన్ని రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉద్యోగ, వ్యాపారాల కోసం జనం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ దైనందిన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కోవిడ్ తర్వాత మానసిక ఆరోగ్యంలో మౌలికమైన మార్పులు వచ్చాయని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధిక ఆచార్య అన్నారు. అప్పుడు అలా.. మార్చి నుంచి ఇంచుమించు ఆగస్టు వరకు కోవిడ్ ఉధృతి కొనసాగింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. వైరస్ బారిన పడినవారిలో పలువురు మృత్యువాత పడ్డారు. ఈ పరిణామాలు ప్రతి ఇంట్లోనూ భయాందోళన కలిగించాయి. లాక్డౌన్ కాలంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. మొదట్లో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు పెరిగినా తర్వాత యాంత్రికంగా మారాయి. నిరాటంకంగా కొనసాగిన అనిశ్చితి కల్లోలాన్ని రేపింది. మహిళలపై పని భారం పెరిగింది. గృహహింస ఎక్కువైంది. దీంతో చాలా మంది డిప్రెషన్‌కు గురయ్యారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోవడం వల్ల చాలాచోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. రోష్ని వంటి స్వచ్ఛంద సంస్థల సహాయ కేంద్రాలకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సుమారు 5 వేలకు పైగా బాధితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పోలీస్ సహాయ కేంద్రాలు, షీటీమ్స్ విభాగాలకు సైతం గృహహింస కేసులు వెల్లువెత్తాయి. వైరస్ బారిన పడిన వారిలో చాలా మంది శారీరకంగా పూర్తిగా కోలుకున్నప్పటికీ మానసికంగా డిప్రెషన్‌కు లోనయ్యారు. ఇంటిల్లిపాది వైరస్ సోకిన కుటుంబాల్లో ఈ ఆందోళనలు, కుంగుబాటు లక్షణాలు మరింత తీవ్రమయ్యాయి. ఇప్పుడు ఇలా.. అన్‌లాక్ 4.0 తర్వాత 80 శాతానికి పైగా ఆంక్షలు తొలగిపోయాయి. అంతటా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. సెప్టెంబర్ నుంచి కరోనా కేసులు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. జనం భయం వీడి బయటకు వచ్చారు. కరోనాతో సహజీవనం తప్పనిసరి అనే అవగాహన పెరిగింది. ఇళ్లకే పరిమితమైన వాళ్లు ఇప్పుడు ఉద్యోగ, వ్యాపారాలకు వెళ్లడమే కాకుండా వీకెండ్స్ కాలక్షేపం కోసం బయటకు వస్తున్నారు. దుర్గం చెరువు, నెక్లెస్‌రోడ్డు వంటి ప్రాంతాలు సందర్శకులతో కనిపిస్తున్నాయి. ఆన్లైన్ పాఠాలతో పిల్లల కుస్తీ.. స్కూళ్లు, విద్యాసంస్థలు తెరుచుకోకపోవడం వల్ల పిల్లలు ఆన్లైన్ చదువులతో కుస్తీ పడుతున్నారు. దీంతో పిల్లలపైన మాత్రం లాక్డౌన్ ప్రభావం కొనసాగుతోంది. స్కూళ్లు, కాలేజీ వాతావరణానికి దూరంగా ఉండటం వల్ల మానసిక వికాసానికి ఒకింత అవరోధంగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్పు వచ్చింది నెల రోజులుగా మానసిక సమస్యలతో వచ్చే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. చాలామంది కోవిడ్ భయంతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు ఆ భయం తొలగింది. కోవిడ్‌ను ఎదుర్కోగలమనే భరోసా వచ్చింది. – డాక్టర్ చల్లా గీత, మానసిక వైద్య నిపుణులు,మనోజాగృతి వ్యవస్థాపకులు. -
మానసిక ఆరోగ్య ప్రాపిరస్తు..!
ఆర్థిక కష్టాలు ఉండవు.. అయినా ఇంకా ఏదో కావాలన్న తపన నిద్రపట్టనీయదు.. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉన్నా.. ఆ ఒక్కరిలో తెలియని వేదన, విద్యార్థి చక్కగా చదువుతాడు.. పరీక్షలంటే భయం, తెలివితేటలు పుష్కలంగా ఉన్నా సమస్య వస్తే ఎదుర్కొనలేకపోవడం.. ఆరోగ్యంగా ఉన్నా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు భయపడడం... పెద్దలు, అధికారులు మందలిస్తే మానసికంగా కుంగిపోవడం.. ఇలాంటి మానసిక సమస్యలతో జిల్లాలో వేలాది మంది సతమతమవుతున్నారు. వైద్యులను ఆశ్రయించి చికిత్స పొందుతున్నారు. నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అలాంటి వారందరికీ మానసిక ఆరోగ్యం ప్రాప్తించాలని ఆకాంక్షిద్దాం. విజయనగరం ఫోర్ట్: ‘ఎంత డబ్బు ఉన్నా ఒంటికి సుఖం లేకపోతే ఎందుకు’ అన్నది పెద్దల మాట. చాలా మంది అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, తీవ్ర పని ఒత్తిడి తదితర కారణాలతో మానసిక సమస్యల బారిన పడుతున్నారు. వీరి సంఖ్య జిల్లాలో పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 15 నుంచి 20 శాతం మందికే వైద్యం ఇప్పటికీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో కేవలం 15 నుంచి 20 శాతం మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. సమాజంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన రాహిత్యం, చిన్న చూపు, అపోహలు, పేదరిక తదితర కారణాలు వారిని ఆస్పత్రికి రాకుండా నిలువరిస్తున్నాయి. మానసిక సమస్యలపై అవగాహన పెంచుకోవడం, అందుబాటులో ఉన్న వైద్యసేవలు పొందడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కోవిడ్–19 వ్యాప్తి జనంను భయపెడుతోంది. ఆరోగ్య సమస్యలు సృష్టిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రచారాలు అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. వాటిలో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. ప్రాణం తీస్తున్న కరోనా భయం.. ఇప్పుడు ప్రపంచమంతా కోవిడ్–19తో పోరాడుతోంది. భౌతిక దూరం, వ్యాధి చికిత్స, వ్యాక్సిన్ పట్ల అనిశ్చితి, ఆర్థిక చిక్కులు తదితర అంశాలు ప్రజల్లో తీవ్ర ఒత్తిడి, ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవన్నీ ప్రజల మానసిక ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్ల మంది వేర్వేరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అంతకు 20 రెట్లు మంది ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఏటా ప్రతి 10 మంది పిల్లలలో ఒకరు, ప్రతి నలుగురు పెద్దలలో ఒకరు కొత్తగా మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఓ అంచనా. జిల్లాలో ఏడాదికి 20 వేల మంది... జిల్లాలో ఏడాదికి 20 వేల నుంచి 24 వేలు మంది వరకు మానసిక సమస్యల బారిన పడుతున్నారు. వీరిలో అనేకమంది వివిధ రకాల మానసిక సమస్యలు భారిన పడుతున్నారు. ఆర్థికంగా నష్టపోయి కొంతమంది, కుటుంబ కలహాలవల్ల కొందరు, అనారోగ్య సమస్యల వల్ల కొందరు మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఒక మనిషి సాధారణ భావోద్వేగాలు, అనుభూతులు పొందుతూ అవసరమైనప్పుడు నియంత్రించుకుంటూ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే శక్తి కలిగి జీవితం గడుపుతుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టే. మంచి ఆరోగ్యం, సరిపడినంత నిద్ర, వ్యాయామం, యోగ, తమకు తాము సమయం కేటాయించుకోవడం, కుటుంబం, స్నేహితులతో మంచి బంధాలు కలిగి ఉండడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఒత్తిడి, కుంగుబాటు, భయం లేదా మరేదైనా మానసిక సమస్య ఎదురైనప్పుడు అందుబాటులో ఉన్న మానసిక ఆరోగ్య నిపుణులను కలిస్తే సమస్య తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు. చికిత్సతో విముక్తి మానసిక సమస్యలు ఎదుర్కొనేవారి సంఖ్య ఇటీవల కాలంలో జిల్లాలో పెరుగుతోంది. ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో వస్తున్నారు. మానసిక సమస్యకు సకాలంలో పరిష్కారం పొందాలి. అవసరమైతే చికిత్స చేయించుకోవాలి. లేదంటే నిద్రలేక ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కడు ఒత్తిడికి దూరం కావాలి. ప్రశాంత జీవనాన్ని అలవర్చుకోవాలి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. వ్యాయామం, యోగ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యంగా జీవించాలి. – డాక్టర్ జాగరపు రమేష్, మానసిక వైద్య నిపుణుడు -
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ర్యాలీ
-
ఊప్రతి నలుగురిలో ఒకరికి..
మానసిక సమస్యలపై కేంద్ర మంత్రి ఫగ్గాన్ సింగ్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మానసిక వ్యాధులకు దారి తీస్తున్న పరిస్థితులు, రుగ్మతలకు చికిత్సలపై ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యవసరమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఫగ్గాన్ సింగ్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవితంలో ఒక్కసారైనా మానసిక రుగ్మతల బారిన పడుతున్నారన్నారు. మానసిన వ్యాధులతో బాధపడుతున్న వారిని సమాజం ఏకాకుల్ని చేయడం, వివక్ష చూపడంతో వారు చికిత్సకు దూరమవుతున్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తుల విషయంలో సమాజం వైఖరి మారాలన్నారు. చికిత్స విషయంలో ఆరోగ్య వ్యవస్థను సున్నితంగా, ఆమోదయోగ్యంగా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అందరూ కలసికట్టుగా అధిగమించాలన్నారు. భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణ ఆరోగ్యవంతులమవుతామని కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. దేశంలో దాదాపు ఏడు శాతం ప్రజలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, సమస్య పరిష్కారానికి మానసిక నిపుణుల అవసరముందన్నారు. అందుకు జాతీయ మానసిక ఆరోగ్య పథకం కింద కేంద్రం నిధులు కేటాయిస్తోందని చెప్పారు.