breaking news
visiti
-
రాహుల్ వస్తుండు..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల 28వ తేదీన ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కాంగ్రెస్ నేతలు ఈ మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రజాకూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సైతం సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా జన సమీకరణపై దృష్టి పెట్టాయి. వాస్తవానికి రాహుల్‌గాంధీ గత నెల 27న జిల్లాలో పర్యటిస్తారని ప్రచారం జరిగింది. ఆ పర్యటన అప్పుడు వాయిదా పడడం, ఈనెల 23వ తేదీన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడంతో మలివిడత పర్యటనలో రాహుల్‌గాంధీ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తొలుత 28న సోనియాగాంధీ జిల్లాలో పర్యటిస్తారని ప్రచారం జరిగింది. ఈ మేరకు అధికారికంగా పర్యటన సైతం ఖరారవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. అయితే అనూహ్యంగా 28వ తేదీన రాహుల్‌గాంధీ జిల్లా పర్యటన ఖరారు కావడంతో కాంగ్రెస్ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ ఖమ్మం జిల్లా పర్యటనలో బహిరంగ సభకు బదులుగా ఖమ్మం నగరంతోపాటు పలు ప్రాంతాల్లో రాహుల్‌తో రోడ్‌షోలు నిర్వహించాలని భావించి.. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నించారు. అయితే భద్రతా కారణాల వల్ల రోడ్‌షోకు అనుమతి లభించే అవకాశం లేదని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5గంటలకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసే హెలిప్యాడ్‌కు హెలీకాప్టర్ ద్వారా చేరుకోనున్న రాహుల్ పక్కనే ఉన్న ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి ప్రజాకూటమి తరఫున పోటీ చేస్తున్న ఖమ్మం టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుతోపాటు జిల్లా కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాల నుంచి వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను రాహుల్‌గాంధీ వేదికపై నుంచి పరిచయం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాహుల్ పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ నేతలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, శాసన మండలి ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు జిల్లాలో పర్యటించి.. రాహుల్ పర్యటనకు జన సమీకరణపై దృష్టి పెట్టారు. -
పుష్కర ఏర్పాట్లు త్వరగా పూర్తి కావాలి
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : పుష్కరాలకు సమయం సమీపిస్తున్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు త్వరగా పూర్తి కావాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.ఎస్.వి.ప్రసాద్ ఆలయ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.ఎస్.వి.ప్రసాద్ గురువారం దుర్గగుడిపై ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత టోల్‌గేటు వద్దకు చేరుకున్న ఆయన ఘాట్ రోడ్డులో జరుగుతున్న గ్రీనరీ పనులను పరిశీలించారు. ఘాట్ రోడ్డు మీదగా కొండపైకి చేరుకుని క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరాల్లో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో సూర్యకుమారిని ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన భద్రతా చర్యల గురించి పోలీసు అధికారులతో చర్చించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. -
మహానందీశ్వరుడిని దర్శించున్న కేఈ
మహనంది: కర్నూలు జిల్లాలోని మహానందీశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాతి నంది విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన కేఈ దంపతులకు ఈవో చంద్రశేఖర్‌రెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు కేఈ దంపతులకు ఆశీర్వచనం చేశారు.