breaking news
vijaymohan
-
27న మాదిగ జేఏసీ జిల్లా సదస్సు
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : ఈ నెల 27వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగహంలో జిల్లా మాదిగ జేఏసీ సదస్సు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్చార్జ్ విజయమోహన్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు సురేష్, సుందర్, నర్సింహులు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
అధికార్ల బాట.. క్షేత్ర పర్యటన
సాక్షి, కర్నూలు : మీరు ఎవరైనా అధికారిని కలవడానికి ప్రభుత్వ కార్యాలయాలకు ఉదయాన్నే వెళదామనుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి.. అధికారులెవ్వరూ ఇకపై అందుబాటులో ఉండడం లేదు. వారంలో సోమవారం (ప్రజాదర్బారు) మినహాయిస్తే మిగిలిన ఐదు రోజులు అధికారులు క్యాంపుల బాట పట్టనున్నారు. కాకపోతే సాయంత్రం ఐదు గంటల తర్వాతే వీరు ఆయా కార్యాలయాల్లో అందుబాటులో ఉండనున్నారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ రెండు రోజుల క్రితం జరిగిన అధికారుల సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి.. ఉదయం పూట వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్తే మాత్రం సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సిందే. ఇక ఐదు రోజులు క్షేత్ర స్థాయిలోనే.. అధికారులు ఇక వారంలో ఐదు రోజులపాటు మంగళవారం నుంచి శనివారం వరకు జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో పర్యటించాల్సిందేనంటూ కలెక్టర్ విజయమోహన్ అధికారులకు స్పష్టంగా ఆదేశించారు. రెండు రోజుల క్రితం జరిగిన జిల్లాస్థాయి అధికారుల సమావేశంలో కలెక్టర్ అధికారుల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎవరెవరు క్షేత్రస్థాయిలో పర్యటించారని ప్రశ్నిం చగా ఓ అధికారి ‘సర్, నేను రెండు రోజులు పర్యటించాను’ అని సమాధానం ఇవ్వగా.. ఇందుకు కలెక్టర్ ‘ప్చ్..’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘లేదు.. ఐదు రోజులు పర్యటించాల్సిందే’ అన్నారు. ప్రతి అధికారి సోమవారం ప్రజాదర్బారులో మినహా మిగిలిన రోజుల్లో క్షేత్రస్థాయి పర్యటనల్లో ఉండాలని కలెక్టర్ సూచించారు. ఉదయమే ఫీల్డ్ విజిట్‌కు బయలుదేరి పనులు ముగించుకుని సాయంత్రంలో ఐదు గంటల తరువాత కార్యాలయాలకు వచ్చి ఆఫీసు పనులు చూసుకోవాలని ఆదేశించారు. కాగా, కలెక్టర్ ఆదేశాల వల్ల కిందిస్థాయిలో ఇబ్బందులు తెలుసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ... అమలు వల్ల సరికొత్త ఇబ్బందులు తప్పవేమోనన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అమలులో ఇబ్బందులు.. పట్టణంలో ఏం జరుగుతోంది? పరిపాలన ఎలా సాగుతోంది? ప్రజలకున్న ఇబ్బందులు ఏమిటి? అని తప్పనిసరిగా పర్యవేక్షించాల్సింది జిల్లా స్థాయి అధికారులు. వారు నగరం/పట్టణాల్లో ఉంటే స్థానికులకు అందుబాటులో ఉంటారని, క్రమం తప్పకుండా పరిశీలిస్తారని ఆశించొచ్చు. ఇకపై అలాగే జరుగుతుందా అంటే కచ్చితమైన సమాధానం దొరకే పరిస్థితులు కనిపించట్లేదు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులు సగం రోజులు సమీక్షలకే సమయం కేటాయించాల్సి వస్తోంది. వీడియో కాన్ఫరెన్సులకు హాజరుకావాల్సి వస్తోంది. రాజధానికి, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. అభివృద్ధి విషయంలో ఎక్కడ ఉన్నామనేది సమీక్షలు నిర్వహిస్తేనే తెలుస్తుంది. మరోవైపు వారంలో ఐదు రోజులు ఫీల్డ్ విజిట్‌కు వెళితే... ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోయే ప్రమాదం ఉందనేది అధికారుల ఆవేదనగా ఉంది. అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో ఉండకపోతే సరికొత్త సమస్యలూ తప్పవనేది వీరి అభిప్రాయం. -
7న గవర్నర్ రాక
ఆళ్లగడ్డ రూరల్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ నెల 7న అహోబిలం రానున్నట్లు సమాచారం. ఆయన వెంట కలెక్టర్ విజయమోహన్ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి రానున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ తహశీల్దార్ మాలకొండయ్య తమ సిబ్బందితో బుధవారం అహోబిలంలో ఏర్పాట్లను పరిశీలించారు. వాటి వివరాలను కలెక్టర్‌కు వివరించినట్లు సమాచారం. -
అక్రమ మైనింగ్‌పై ప్రత్యేక నిఘా: కలెక్టర్ విజయమోహన్
కర్నూలు: అక్రమ మైనింగ్‌ను నియంత్రించేందుకు నిఘాను పటిష్టం చేస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్ తెలిపారు. 10 చెక్‌పోస్ట్‌లు, నియంత్రణా కమిటీలతో పాటు ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక నుంచి ఇసుక రీచ్‌లు డ్వాక్రా మహిళాసంఘాల ఆధీనంలో ఉంటాయని విజయ్‌మోహన్ వివరించారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఇకపై మీ సేవా ద్వారా ఇసుక కోనుగోలు చేయాలని విజయ్‌మోహన్ తెలిపారు.