breaking news
in vegeswarapuram
-
ముగిసిన మేరీమాత ఉత్సవాలు
వేగేశ్వరపురం (తాళ్లపూడి): మేరీమాత దర్శనమాత అని పుణ్యక్షేత్ర డైరెక్టర్ జి.డేవిడ్ అన్నారు. వేగేశ్వరపురంలోని నిత్య సహాయ గోదావరి మేరీమాత మహోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో బిషప్ పొలిమెర జయరావుకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పశువుల పాక, (బాలేసు ప్రభు మందిరం), ఫాతిమా మాత విగ్రహాలను ఆవిష్కరించారు. ఫాదర్ ఐ. మైఖేల్, దగాని జేవియర్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మేరిమాత ఆలయ ప్రాంగణంలోని గెత్సమనే తోటలో ఏసుప్రభువు విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విజయవాడ కళాదర్శన్ వారితో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఫాదర్ జె.డేవిడ్ మాట్లాడుతూ మేరీమాత కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతోందన్నారు. ఇతరులకు సాయం చేయడం ద్వారా దేవుడి అనుగ్రహం పొందవచ్చన్నారు. వేగేశ్వరపురంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. -
210 దేశాల్లో సేవలు
తాళ్లపూడి : జిల్లాలోని పేద, మధ్యతరగతి ప్రజలకు డయాలసిస్ సేవలు తణుకులో అందజేయడం జరుగుతుందని లయన్స్క్లబ్ గవర్నర్ డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి అన్నారు. లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో వేగేశ్వరపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఆదివారం ఉచిత మెగా వెద్య శిబిరాన్ని నిర్వహించారు. మండల లయన్స్క్లబ్ అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరాన్ని లయన్స్క్లబ్ గవర్నర్ డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 210 దేశాల్లో లయన్స్క్లబ్ సేవలు అందజేస్తున్నారన్నారు. ఈ ఏడాది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. మనదేశంలో 2.40 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు. వచ్చే మూడేళ్లలో 20 కోట్ల మందికి సాయం చేయాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. తణుకు ప్రభుత్వాసుపత్రిలో మధ్యతరగతి ప్రజలకు కేవలం రూ.800కే డయాలసిస్ సేవలు అందిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన శ్రీరమా దంత వైద్యశాల, కిమ్స్ బొల్లినేని హాస్పటల్, నిడదవోలు శ్రీరాజేశ్వరి లయన్స్ కంటి హాస్పటల్ వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. దంత పరీక్షలు, గుండె వ్యాధులకు ఈసీజీ, ఆర్ధోపెడిక్, న్యూరాలజీ, కిడ్నీ, యూరాలజీ, బీపీ, షుగర్, పక్షవాతం తదితర వ్యాధులకు, కంటి పరీక్షలు చేశారు. ఈ వైద్యశిబిరంలో 700 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి అందరికీ ఉచితంగా మందులను అందజేశారు. 60 మందికి కళ్లజోళ్లు ఉచితంగా అందించారు. 10 మందికి ఆపరేషన్ల కోసం సిఫార్సు చేశారు. మండల లయన్స్క్లబ్ అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు, చార్టర్ ప్రెసిడెంట్ మారిన రామూర్తి, వల్లభనేని శ్రీనివాస్, కె.రవికుమార్, పాపారావు నాయుడు, గర్రే వెంకటరత్నం, వి.చంద్రయ్య పాల్గొన్నారు.