breaking news
vedios post
-
యూట్యూబ్ సంచలన నిర్ణయం
న్యూయార్క్ : ప్రముఖ వీడియో వెబ్సైట్ ‘యూట్యూబ్’ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాల తయారీ, అమ్మకాలకు సంబంధించిన వీడియోలను తమ సైట్లో నిషేధించాలని నిర్ణయించింది. ఆయుధాల వాడకంతో సమాజంలో చోటుచేసుకుంటున్న తీవ్ర పరిణామాలతో ఆంక్షలను యూట్యూబ్ కఠినతరం చేసింది. గత నెల అమెరికాలోని పార్క్‌లాండ్ స్కూల్లో చోటుచేసుకున్న సామూహిక కాల్పుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్ధ తెలిపింది. నాలుగు నెలలుగా ఈ విషయంపై సంస్థ నిపుణులతో చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ఆయుధాలను ఎలా ఉపయోగించాలో తెలిపే వీడియోలను య్యూట్యూబ్ ఇదివరకే నిషేధించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలను చూసి స్ఫూర్తి పొందిన ఓ వ్యక్తి లాస్‌వెగాస్‌లో 58 మందిని కాల్చి చంపాడు. ఈ ఘటన అనంతరం యూట్యూబ్ ఆయుధాలకు సంబంధించిన వీడియోలపై నిషేదం విధించింది. వచ్చే నెల నాటికి పూర్తి స్థాయిలో ఈ నిషేధాన్ని అమలులోకి తెస్తామని సంస్థ తెలిపింది. -
వీడియోలు పోస్ట్ చేస్తే... లాభాల్లో సగం మీకే!
ప్రపంచలోనే అతిపెద్ద రిటైలర్ అమెజాన్.కామ్, ఆల్ఫాబెట్ ఇంక్స్ యూట్యూబ్ తో పోటీకి సిద్ధమైంది. అమెజాన్ మంగళవారం ఓ కొత్త సర్వీసును ఆవిష్కరించింది. యూజర్లకు వీడియోలు పోస్ట్ చేసుకునే సదుపాయంతో పాటు వాటిలో లాభాలను ఆర్జించే అవకాశాన్ని కల్పించింది. 'అమెజాన్ వీడియో డైరెక్ట్' పేరుతో ఈ సర్వీసును లాంచ్ చేసింది. వీడియోలను అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయాల్లో 50 శాతం కంటెంట్ క్రియేటర్స్ కు చెల్లించేందుకు అమెజాన్ సిద్ధమైంది. కంపెనీ లైసెన్సు అగ్రిమెంట్ ప్రకారం అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. యాడ్-సపోర్డెడ్ వీడియోలకు, నికర ప్రకటన లాభాలనుంచి సగం క్రియేటర్స్ పొందేలా అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైమ్ లోయల్టీ ప్రొగ్రామ్ ద్వారా అమెజాన్ ఇప్పటికే ఒరిజినల్ టీవీ ప్రొగ్రామ్ లను, డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్ట్స్, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ వీడియోలను వినియోగదారులకు యాక్సెస్ లో ఉంచింది. అదేవిధంగా వార్షిక ఫీజు 99 డాలర్లతో ఒక గంటలోనే కొనుగోలు చేసిన వస్తువులను డెలివరీ చేసే సర్వీసును కూడా అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ షేర్లు గత 12 నెలల్లో 57శాతం పెరిగాయి. ఈ సర్వీసు కోసం అమెజాన్ వివిధ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే నెలకు 10.99 డాలర్ల సబ్ స్క్రిప్షన్ తో వీడియో ప్రొగ్రామ్ ను, 8.99 డాలర్ల ఫీజుతో వీడియో స్ట్రీమింగ్ సర్వీసును అమెజాన్ ఆఫర్ చేస్తోంది.